షియోమీ నుంచి ఎంఐ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు..!

August 27, 2021 1:01 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ కొత్త‌గా ఎంఐ నోట్ బుక్ ప్రొ, ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా పేరిట రెండు నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను అందిస్తున్నారు. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

షియోమీ నుంచి ఎంఐ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు..!

ఎంఐ నోట్ బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లో.. 14 ఇంచుల డిస్‌ప్లే ఉంది. దీనికి 2560 × 1600 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తుంది. ఇంటెల్ 11వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెస‌ర్ ఆప్ష‌న్ల‌ను ఇందులో అందిస్తున్నారు. 8/16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 హోమ్‌, హెచ్‌డీ వెబ్‌క్యామ్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సీ, డీటీఎస్ ఆడియో ఫీచ‌ర్లు ల‌భిస్తున్నాయి. కేవ‌లం 34 నిమిషాల్లోనే 50 శాతం వ‌ర‌కు చార్జింగ్ అవుతుంది. 11 గంట‌ల వ‌ర‌కు వీడియోల‌ను చూడ‌వ‌చ్చు.

ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ల్యాప్‌టాప్‌లో.. 15.6 ఇంచుల డిస్‌ప్లే ఉంది. 3200 × 2000 పిక్స‌ల్స్‌ రిజ‌ల్యూష‌న్ ల‌భిస్తుంది. డిస్‌ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇంటెల్ 11వ జ‌న‌రేష‌న్ కోర్ ఐ7, ఐ5 ప్రాసెస‌ర్ ఆప్ష‌న్లు ల‌భిస్తున్నాయి. 8/16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 హోమ్‌, హెచ్‌డీ వెబ్ క్యామ్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, డీటీఎస్ ఆడియో ఫీచ‌ర్లు ఇందులో ల‌భిస్తున్నాయి. కేవ‌లం 45 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ అవుతుంది. 12 గంట‌ల వ‌ర‌కు వీడియోల‌ను చూడ‌వచ్చు.

ఎంఐ నోట్ బుక్ ప్రొ ధ‌ర‌లు

  • ఇంటెల్ కోర్ ఐ5-11300హెచ్‌-8జీబీ ర్యామ్ – ధ‌ర రూ.56,999
  • ఇంటెల్ కోర్ ఐ5-11300హెచ్‌-16జీబీ ర్యామ్ – ధ‌ర రూ.59,999
  • ఇంటెల్ కోర్ ఐ7-11370హెచ్‌-16జీబీ ర్యామ్ – ధ‌ర రూ.72,999

ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ధ‌ర‌లు

  • ఇంటెల్ కోర్ ఐ5-11300హెచ్‌-8జీబీ ర్యామ్ – ధ‌ర రూ.59,999
  • ఇంటెల్ కోర్ ఐ5-11300హెచ్‌-16జీబీ ర్యామ్ – ధ‌ర రూ.63,999
  • ఇంటెల్ కోర్ ఐ7-11370హెచ్‌-16జీబీ ర్యామ్ – ధ‌ర రూ.76,999

ఈ ల్యాప్‌టాప్‌ల‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఎంఐ హోమ్ స్టోర్స్‌, అమెజాన్‌, రిటెయిల్ స్టోర్స్ లో ఆగ‌స్టు 31వ తేదీ నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.4500 వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now