48 మెగాపిక్స‌ల్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాట‌రీతో గెలాక్సీ ఎఫ్‌12 స్మార్ట్ ఫోన్‌..!

April 5, 2021 1:38 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌12 పేరిట ఎఫ్ సిరీస్‌లో ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 4జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 5 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు.

Samsung Galaxy F12 smart phone launched in india

ఈ ఫోన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ప‌క్క భాగంలో ఇచ్చారు. ఇందులో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని అమ‌ర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ల‌భిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌12 ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే
  • 720×1600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఎగ్జినోస్ 850 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్
  • 48, 5, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, 4జీ వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌12 స్మార్ట్ ఫోన్ సీ గ్రీన్‌, స్కై బ్లూ, సెలెస్టియ‌ల్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.11,999గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్లు, రిటెయిల్ స్టోర్స్‌లో ఏప్రిల్ 12వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఈఎంఐ స‌దుపాయం కూడా అందిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment