మొబైల్స్ తయారీదారు షియోమీ.. రెడ్‌మీ నోట్ 10ఎస్ పేరిట భారత్‌లో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్‌లు లభిస్తాయి. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది. ఫోన్ 30 నిమిషాల్లోనే 54 శాతం, 78 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్, డీప్ సీ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా, ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను మే 18వ తేదీ నుంచి విక్రయించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…