షియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

May 13, 2021 9:01 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ నోట్ 10ఎస్ పేరిట భార‌త్‌లో ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ల‌భిస్తుంది. ముందు వైపు 13 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేయ‌గా, ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌లు ల‌భిస్తాయి. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు.

Redmi Note 10S smart phone launched in india

ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంటుంది. వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. ఫోన్ 30 నిమిషాల్లోనే 54 శాతం, 78 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్త‌వుతుంది.

రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫీచ‌ర్లు

  • 6.43 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
  • 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, ఐపీ 53 వాట‌ర్ రెసిస్టెన్స్
  • డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
  • 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ షాడో బ్లాక్‌, ఫ్రాస్ట్ వైట్‌, డీప్ సీ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా, ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.14,999గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.15,999గా ఉంది. అమెజాన్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను మే 18వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment