ఒప్పో నుంచి త‌క్కువ ధ‌ర‌కే కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయో చూడండి..!

April 28, 2021 12:27 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో.. ఎ53ఎస్ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఒప్పోకు చెందిన లేటెస్ట్ బ‌డ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 8జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. దీనికి తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ కెమెరాల‌ను కూడా వెనుక‌వైపు ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కు ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ పక్క వైపున ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

OPPO A53s 5G smart phone launched in india

ఒప్పో ఎ53ఎస్ 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
  • 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి
  • 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఒప్పో ఎ53ఎస్ 5జి స్మార్ట్ ఫోన్ క్రిస్ట‌ల్ బ్లూ, ఇంక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,990 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మెడ‌ల్ ధ‌ర రూ.16,990గా ఉంది. ఈ ఫోన్‌ను మే 2వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తారు.

లాంచింగ్ సంద‌ర్బంగా ఈ ఫోన్‌పై ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌తో రూ.1250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. 1 ఏడాది పాటు ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తారు. కేవ‌లం రూ.1కే 70 శాతం బై బ్యాక్ వాల్యూను అందిస్తారు. 9 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ప‌లు ప్ర‌ముఖ బ్యాంకుల‌కు చెందిన కార్డుల‌తో 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. జీరో డౌన్ పేమెంట్‌తో ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. 6 నెలల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం అందిస్తారు. పేటీఎంతో కొనుగోలు చేస్తే 11 శాతం క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment