---Advertisement---

వై సిరీస్‌లో నూత‌న స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన వ‌న్‌ప్ల‌స్‌.. ధ‌ర ఎంతంటే..?

May 25, 2021 12:17 PM
---Advertisement---

వ‌న్‌ప్ల‌స్ సంస్థ వై సిరీస్‌లో నూత‌న స్మార్ట్ టీవీని భార‌త్‌లో లాంచ్ చేసింది. వ‌న్‌ప్ల‌స్ వై1 40 పేరిట ఆ టీవీ విడుద‌లైంది. అందులో వ‌న్ ప్ల‌స్ సినిమాటిక్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారంగా ఆ టీవీ ప‌నిచేస్తుంది. అందులో బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్‌, గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

OnePlus Y1 40 smart tv launched in india

వ‌న్‌ప్ల‌స్ వై1 40 ఫీచ‌ర్లు

  • 43 ఇంచుల ఎల్ఈడీ డిస్‌ప్లే, 1920 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెస‌ర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ టీవీ 9.0, ఆక్సిజ‌న్ ప్లే
  • గూగుల్ అసిస్టెంట్ బిల్టిన్‌, వైఫై, బ్లూటూత్ 5.0
  • హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఈథ‌ర్‌నెట్
  • 20 వాట్ల స్పీక‌ర్‌, డాల్బీ ఆడియో

వ‌న్‌ప్ల‌స్ వై1 40 టీవీ ధ‌ర రూ.21,999 ఉండ‌గా ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 26వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు. ఈ టీవీ అస‌లు ధ‌ర రూ.23,999. లాంచింగ్ సంద‌ర్భంగా రూ.21,999కే అందిస్తున్నారు. యూజ‌ర్లకు ఈ టీవీపై 12 నెల‌ల నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం ల‌భిస్తుంది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now