Infinix 40X1: 40 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ధ‌ర రూ.19వేలు మాత్ర‌మే..

July 31, 2021 11:44 AM

Infinix 40X1: ఇన్ఫినిక్స్ కంపెనీ ఎక్స్‌1 సిరీస్‌లో మ‌రో నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుద‌ల చేసింది. ఇన్ఫినిక్స్ 40ఎక్స్‌1 పేరిట ఆ టీవీని లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది.

Infinix 40X1 android smart tv launched

ఇన్ఫినిక్స్ 40ఎక్స్1 టీవీలో 40 ఇంచుల డిస్‌ప్లే ఉంది. ఇది ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ (1920 x 1080)ను క‌లిగి ఉంది. ఇన్ఫినిక్స్ ఎపిక్ 2.0 పిక్చ‌ర్ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది. ఈ టీవీలో క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. 1జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్ ల‌భిస్తున్నాయి.40 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ధ‌ర రూ.19వేలు మాత్ర‌మే..

ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్ ఉంది. క్రోమ్‌క్యాస్ట్ ఫీచ‌ర్‌ను బిల్టిన్‌గా అందిస్తున్నారు. గూగుల్ అసిస్టెంట్‌, గూగుల్ ప్లే స్టోర్‌కు స‌పోర్ట్ ల‌భిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్స్‌కు ఈ టీవీలో స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

ఈ టీవీలో వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, బ్లూటూత్ రిమోట్‌, డాల్బీ ఆడియో వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ ఇ0ఎక్స్‌1 టీవీ ధ‌ర రూ.19,999గా ఉంది. దీన్ని ఫ్లిప్ కార్ట్‌లో విక్ర‌యిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment