ప్రముఖ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్ తన మిస్‌ఫిట్ అనే సబ్ బ్రాండ్ కింద పలు నూతన ట్రిమ్మర్లను లాంచ్ చేసింది. టి150, టి50 లైట్, టి30 పేరిట ఆ ట్రిమ్మర్లు విడుదలయ్యాయి. మిస్‌ఫిట్ టి150 ట్రిమ్మర్‌లో పలు స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్నారు. వీటి ద్వారా 120 నిమిషాల మేర బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
మిస్‌ఫిట్ టి150 ట్రిమ్మర్ ద్వారా సులభంగా ట్రిమ్ చేసుకోవచ్చు. టైటానియం కోటెడ్ బ్లేడ్స్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. 40 రకాల లెంగ్త్ సెట్టింగ్స్ ఇందులో లభిస్తున్నాయి. 3 గైడెడ్ కోంబ్ అటాచ్‌మెంట్లను ఏర్పాటు చేశారు. రెండు రకాల స్పీడ్‌లతో పని చేసుకోవచ్చు. నార్మల్ లేదా టర్బో మోడ్‌లో పనిచేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తుంది. 1 గంట పాటు చార్జ్ చేస్తే చాలు 90 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు.
టి50 లైట్ ట్రిమ్మర్లో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్‌ను ఏర్పాటు చేశారు. 5 లెవల్స్‌తో కూడిన లెంగ్త్ సెట్టింగ్స్ ఉన్నాయి. 0.5 ఎంఎం నుంచి 12 ఎంఎం వరకు ట్రిమ్ చేసుకోవచ్చు. మైక్రో యూఎస్‌బీ ద్వారా చార్జ్ అవుతుంది. 120 నిమిషాల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
మిస్‌ఫిట్ టి30 ట్రిమ్మర్‌లోనూ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్‌ను ఏర్పాటు చేవారు. 0.5 ఎంఎం నుంచి 12 ఎంఎం వరకు లెంగ్త్ సెట్టింగ్స్ లభిస్తాయి. 60 నిమిషాల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.
మిస్‌ఫిట్ టి30 ట్రిమ్మర్ ధర రూ.599 ఉండగా టి50 లైట్ ధర రూ.799 గా ఉంది. మిస్‌ఫిట్ టి150 ట్రిమ్మర్ ధర రూ.1299గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…