స్మార్ట్ ఫీచ‌ర్ల‌తో బోట్ కంపెనీ నుంచి ట్రిమ్మ‌ర్లు.. ధ‌ర‌లు త‌క్కువే..!

September 8, 2021 5:52 PM

ప్ర‌ముఖ ఆడియో ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ బోట్ త‌న మిస్‌ఫిట్ అనే స‌బ్ బ్రాండ్ కింద ప‌లు నూత‌న ట్రిమ్మ‌ర్ల‌ను లాంచ్ చేసింది. టి150, టి50 లైట్‌, టి30 పేరిట ఆ ట్రిమ్మ‌ర్లు విడుద‌ల‌య్యాయి. మిస్‌ఫిట్ టి150 ట్రిమ్మ‌ర్‌లో ప‌లు స్మార్ట్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటి ద్వారా 120 నిమిషాల మేర బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది.

స్మార్ట్ ఫీచ‌ర్ల‌తో బోట్ కంపెనీ నుంచి ట్రిమ్మ‌ర్లు.. ధ‌ర‌లు త‌క్కువే..!

మిస్‌ఫిట్ టి150 ట్రిమ్మ‌ర్ ద్వారా సుల‌భంగా ట్రిమ్ చేసుకోవ‌చ్చు. టైటానియం కోటెడ్ బ్లేడ్స్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. 40 ర‌కాల లెంగ్త్ సెట్టింగ్స్ ఇందులో ల‌భిస్తున్నాయి. 3 గైడెడ్ కోంబ్ అటాచ్‌మెంట్ల‌ను ఏర్పాటు చేశారు. రెండు ర‌కాల స్పీడ్‌ల‌తో ప‌ని చేసుకోవ‌చ్చు. నార్మ‌ల్ లేదా ట‌ర్బో మోడ్‌లో ప‌నిచేస్తుంది. డిజిట‌ల్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ ల‌భిస్తుంది. 1 గంట పాటు చార్జ్ చేస్తే చాలు 90 నిమిషాల పాటు ఉప‌యోగించుకోవ‌చ్చు.

టి50 లైట్ ట్రిమ్మ‌ర్లో స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్‌ను ఏర్పాటు చేశారు. 5 లెవ‌ల్స్‌తో కూడిన లెంగ్త్ సెట్టింగ్స్ ఉన్నాయి. 0.5 ఎంఎం నుంచి 12 ఎంఎం వ‌ర‌కు ట్రిమ్ చేసుకోవ‌చ్చు. మైక్రో యూఎస్‌బీ ద్వారా చార్జ్ అవుతుంది. 120 నిమిషాల బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది.

మిస్‌ఫిట్ టి30 ట్రిమ్మ‌ర్‌లోనూ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్‌ను ఏర్పాటు చేవారు. 0.5 ఎంఎం నుంచి 12 ఎంఎం వ‌ర‌కు లెంగ్త్ సెట్టింగ్స్ ల‌భిస్తాయి. 60 నిమిషాల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది.

మిస్‌ఫిట్ టి30 ట్రిమ్మ‌ర్ ధ‌ర రూ.599 ఉండ‌గా టి50 లైట్ ధ‌ర రూ.799 గా ఉంది. మిస్‌ఫిట్ టి150 ట్రిమ్మ‌ర్ ధ‌ర రూ.1299గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now