జెన్‌బుక్‌, వివోబుక్ సిరీస్‌లో అసుస్ నుంచి నూత‌న ల్యాప్‌టాప్‌లు

March 31, 2021 2:44 PM

అసుస్ కంపెనీ భార‌త్‌లో జెన్‌బుక్‌, వివోబుక్ సిరీస్‌లో ప‌లు ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. వీటి ధ‌ర‌లు రూ.54వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అన్ని ల్యాప్‌టాప్‌ల‌లోనూ ఏఎండీకి చెందిన లేటెస్ట్ రైజ‌న్ 5000 యు-సిరీస్ ప్రాసెస‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్‌లలో ఓలెడ్ డిస్‌ప్లే ఆప్ష‌న్ కూడా ల‌భిస్తోంది. ఇక వీటిలో జెన్‌బుక్ సిరీస్‌లో UM325UA అనే పేరున్న మోడ‌ల్ ల్యాప్‌టాప్ ప్రీమియం సెజ్‌మెంట్‌లో ల‌భిస్తోంది. ఇందులో ఫుల్ హెచ్‌డీ నానో ఎడ్జ్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ గ‌రిష్టంగా 16 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది. కేవ‌లం 1.11 కిలోల బ‌రువును మాత్ర‌మే క‌లిగి ఉంటుంది.

asus zenbook and vivobook new model laptops launched in india

అసుస్ కొత్త ల్యాప్‌టాప్‌ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

  • జెన్ బుక్ 13 ఓలెడ్ (UM325UA) – ధ‌ర రూ.79,990
  • వివోబుక్ ఎస్ ఎస్‌14 (M433) – ధ‌ర రూ.65,990
  • వివోబుక్ అల్ట్రా కె14, కె15 – ధ‌ర రూ.58,990
  • వివోబుక్ ఫ్లిప్ 14 (TM420) – ధ‌ర రూ.59,990
  • వివోబుక్ 15 (M515) – ధర రూ.54,990
  • వివోబుక్ 17 (M712) – ధ‌ర రూ.62,990

అసుస్‌కు చెందిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌డం ద్వారా ఈ ల్యాప్ టాప్‌ల గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక వీటిని దేశ‌వ్యాప్తంగా ఉన్న అసుస్ రిటెయిల్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment