ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఇక సుల‌భంగా పేమెంట్లు చేయ‌వ‌చ్చు..!

June 9, 2021 11:54 AM

క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల ఇళ్లలోనే ఉంటున్న చాలా మంది ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో అన్ని వ‌స్తువుల‌ను ఆర్డ‌ర్ చేస్తున్నారు. కిరాణా స‌రుకులు, ఎల‌క్ట్రానిక్స్ త‌దిత‌ర అనేక వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లోనే ఆర్డ‌ర్ చేస్తున్నారు. దీంతో కావ‌ల్సిన వ‌స్తువులు ఇంటికే డెలివ‌రీ అవుతున్నాయి.

flipkart introduces qr code based payment method

అయితే క్యాష్ ఆన్ డెలివ‌రీ ప‌ద్ద‌తిలోనూ వ‌స్తువుల‌ను కొనుగోలు చేసే స‌దుపాయాన్ని ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అందిస్తున్నాయి. దీంతో వినియోగ‌దారులు ఇంటి వ‌ద్దే న‌గ‌దు ఇచ్చి త‌మ వ‌స్తువుల‌ను తీసుకోవ‌చ్చు. అయితే క‌రోనా కార‌ణంగా న‌గ‌దు ఇవ్వ‌డం రిస్క్‌తో కూడుకున్న ప‌ని. క‌నుక ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కొత్త పేమెంట్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీంతో పేమెంట్లు సుల‌భంగా న‌గ‌దు చెల్లించ‌వ‌చ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో క్యాష్ ఆన్ డెలివ‌రీ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే వినియోగ‌దారుల‌కు చెందిన వ‌స్తువు ప్యాకేజీపై క్యూ ఆర్ కోడ్‌ను ప్రింట్ చేస్తారు. డెలివ‌రీ స‌మయంలో ఆ క్యూఆర్ కోడ్‌ను యూపీఐ యాప్‌ల‌తో స్కాన్ చేసి పేమెంట్లు చేయ‌వ‌చ్చు. దీంతో సుర‌క్షితంగా పేమెంట్లు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. కోవిడ్ రిస్క్ త‌గ్గుతుంది. దీన్నే క్యూఆర్ కోడ్ ఆధారిత పే-ఆన్‌-డెలివ‌రీ ప‌ద్ధ‌తిగా ఫ్లిప్ కార్ట్ పేర్కొంటోంది. ఇది క్యాష్ ఆన్ డెలివ‌రీ ఆప్ష‌న్ ఎంచుకునే వారికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఫ్లిప్‌కార్ట్ తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment