ఫ్లిప్‌కార్ట్‌లో మ‌ళ్లీ ప్ర‌త్యేక సేల్‌.. ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు.. పూర్తి వివ‌రాలివే..!

August 4, 2021 8:52 PM

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవ‌లే ఓ ప్ర‌త్యేక‌మైన సేల్‌ను నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. అయితే మ‌ళ్లీ ఇంకో సేల్‌ను ఆగ‌స్టు 5 నుంచి నిర్వ‌హించ‌నుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగ‌స్టు 5 నుంచి 9వ తేదీ వ‌ర‌కు కొన‌సాగనుంది. ఇందులో భాగంగా అనేక ఆఫ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

flipkart big saving days sale offers huge discounts

ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. సేల్‌లో రోజూ రాత్రి 12 గంట‌ల‌కు, ఉద‌యం 8 గంట‌ల‌కు, సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన డీల్స్ ఉంటాయి. అర్థ‌రాత్రి 2 గంట‌ల‌కు కూడా ప్ర‌త్యేకంగా సేల్‌ల‌ను నిర్వ‌హిస్తారు.

ఈ సేల్‌లో భాగంగా మోటోరోలా రేజ‌ర్ ఫోన్‌ను రూ.11వేల త‌గ్గింపు ధ‌ర‌తో రూ.54,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే ఐఫోన్ 11 రూ.5901 త‌గ్గింపుతో రూ.48,999 ధ‌ర‌కు, అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 3 రూ.7వేల త‌గ్గింపుతో రూ.39,999 ధ‌ర‌కు, ఐఫోన్ ఎక్స్ఆర్ రూ.8901 త‌గ్గింపుతో రూ.38,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి.

  • ఐఫోన్ ఎస్ఈ 2 – రూ.32,999 (రూ.16వేలు త‌గ్గింపు)
  • గూగుల్ పిక్స‌ల్ 4ఎ – రూ.29,999 (రూ.2వేలు త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి ఎక్స్‌7 ప్రొ 5జి – రూ.26,999 (రూ.3వేలు త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి ఎక్స్‌7 మ్యాక్స్ – రూ.24,999 (రూ.2వేలు త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి ఎక్స్‌3 సూప‌ర్ జూమ్ – రూ.21,999 (రూ.4వేలు త‌గ్గింపు)
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌62 – రూ.17,999 (రూ.6వేలు త‌గ్గింపు)
  • మోటో జి60 – రూ.16,999 (రూ.1000 త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి7 ప్రొ – రూ.15,999 (రూ.3వేలు త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి నార్జో 30 ప్రొ 5జి – రూ.15,499 (రూ.1వేయి త‌గ్గింపు)
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌41 – రూ.14,499 (రూ.2వేలు త‌గ్గింపు)
  • రియ‌ల్‌మి 8 – రూ.13,999 (రూ.1వేయి త‌గ్గింపు)
  • మోటోరోలా జి40 ఫ్యుష‌న్ 0 రూ.13,499 (రూ.1000 త‌గ్గింపు)
  • రెడ్‌మీ నోట్ 9 – రూ.11,999 (రూ.1500 త‌గ్గింపు)
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 – రూ.10,999 (రూ.2వేలు త‌గ్గింపు)
  • మోటో ఇ7 ప‌వ‌ర్ – రూ.6,999 (రూ.500 త‌గ్గింపు)
  • నోకియా సి3 – రూ.6,999 (రూ.500 త‌గ్గింపు)

సేల్‌లో భాగంగా యాపిల్ వాచ్ సిరీస్ 3, ఇత‌ర యాపిల్ వాచ్‌ల‌ను రూ.16,900 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. హాన‌ర్ మాజిక్ వాచ్ 2 రూ.3వేల త‌గ్గింపుతో రూ.9,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. అమేజ్‌ఫిట్ టి-రెక్స్ వాచ్ రూ.3500 త‌గ్గింపుతో రూ.6499కు, అమేజ్‌ఫిట్ జీటీఎస్ రూ.500 త‌గ్గింపుతో రూ.5499కు ల‌భిస్తున్నాయి.

సేల్‌లో ట్యాబ్‌ల‌పై 45 శాతం, స్టోరేజ్ డివైస్‌ల‌పై 75 శాతం, ప‌వ‌ర్ బ్యాంకుల‌పై 70 శాతం, హెడ్ ఫోన్లు, స్పీక‌ర్ల‌పై 70 శాతం, మానిట‌ర్ల‌పై 40 శాతం, బెస్ట్ సెల్లింగ్ టీవీల‌పై 64 శాతం, ఇత‌ర టీవీల‌పై 56 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. స్ట్రీమింగ్ డివైస్‌ల‌ను రూ.1645 ప్రారంభ ధ‌రకు, గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను రూ.49,900 ప్రారంభ ధ‌ర‌కు, ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్‌టాప్‌ల‌ను రూ.33,990 ప్రారంభ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల‌తో రూ.5వేలు ఆపైన విలువైన వ‌స్తువుల కొనుగోలుపై 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment