రూ.96వేల ఏసీ.. రూ.6వేల‌కే.. అమెజాన్‌లో విక్ర‌యం..!

July 7, 2021 1:18 PM

ప్ర‌త్యేక సేల్స్ పేరిట ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అప్పుడ‌ప్పుడు భారీ డిస్కౌంట్ల‌తో వ‌స్తువుల‌ను అమ్ముతుంటాయి. గ‌రిష్టంగా 50-60 శాతం వ‌ర‌కు కొన్ని ర‌కాల వ‌స్తువుల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తుంటాయి. అయితే అమెజాన్ సంస్థ‌ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ సేల్‌లో మాత్రం ఓ ఏసీపై ఏకంగా 94 శాతం త‌గ్గింపును అందించింది. దీంతో కొంద‌రు అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ఆ ఏసీని కొనుగోలు చేశారు.

amazon lists rs 90000 toshiba ac for rs 6000

అమెజాన్‌లో తోషిబా 2021 స్ప్లిట్ ఏసీ ధర రూ.96,700గా ఉంది. అయితే ఈ ఏసీపై 94 శాతం త‌గ్గింపు ధ‌ర‌ను ఇచ్చారు. దీంతో రూ.5,900కే ఏసీ ల‌భించింది. విష‌యం తెలుసుకున్న కొంద‌రు ఏసీని కొనుగోలు చేశారు. అయితే సాంకేతిక స‌మ‌స్య వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని తెలుసుకున్న అమెజాన్ వెంట‌నే లోపాన్ని స‌వరించింది. దీంతో ప్ర‌స్తుతం అదే ఏసీ 30 శాతం త‌గ్గింపుతో రూ.59వేల‌కు ల‌భిస్తోంది. స‌ద‌రు ఏసీలో బాక్టీరియ‌ల్ కోటింగ్‌, డ‌స్ట్ ఫిల్ట‌ర్‌, డీ హ్యుమిడిఫైర్ వంటి స‌దుపాయాలు ఉన్నాయి. అందువ‌ల్లే ఆ ఏసీ అంత‌టి ధ‌ర‌ను క‌లిగి ఉంది.

అయితే ఏసీని కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే రూ.5,900 ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. నిజానికి అమెజాన్‌లో ఇలా జ‌ర‌గ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలోనూ ఓ సేల్ సందర్భంగా రూ.9 ల‌క్ష‌ల విలువైన కెమెరాను రూ.6500 విక్ర‌యించారు. దీంతో ఆఫ‌ర్ తెలిసిన జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. అయితే త‌ప్పు తెలుసుకున్న అమెజాన్ వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. ఇక ఇప్పుడు కూడా ఇలాగే జ‌ర‌గ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment