ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ..!

September 16, 2021 10:05 PM

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. వారి కోసం ఎయిర్‌టెల్ కొత్త‌గా ప‌లు ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ల‌ను రీచార్జి చేసుకుంటే ఏడాది వ్య‌వ‌ధి గ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.

ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ..!

ఎయిర్‌టెల్ సంస్థ కొత్త‌గా రూ.499, రూ.699, రూ.2798 ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇవి ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. రూ.499 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా ఉచితంగా ల‌భిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. దీంతోపాటు 1 ఏడాది వ్య‌వ‌ధి గ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ మొబైల్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. అలాగే అపోలో 24/7 స‌ర్కిల్ 3 నెల‌ల మెంబ‌ర్‌షిప్ ఉచితంగా వ‌స్తుంది. దీంతోపాటు షా అకాడ‌మీ నుంచి ఉచిత కోర్సులు ల‌భిస్తాయి.

ఇక రూ.699 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా ల‌భిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వ‌స్తాయి. రూ.2798 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా వ‌స్తుంది. కాల్స్, మెసేజ్ లు కూడా వ‌స్తాయి. ఇక రూ.699, రూ.2798 ప్లాన్ల‌కు కూడా హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా వ‌స్తుంది. రూ.499 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండ‌గా, రూ.699 ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది. రూ.2798 ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణ‌యించారు.

అయితే ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్లు రూ.499 ఆపైన విలువ గల ప్లాన్‌ల‌ను తీసుకుంటే వారికి ఎలాంటి అద‌న‌పు చార్జి లేకుండానే హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. ఇందుకు గాను వారు ఎయిర్ టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఇచ్చే థ్యాంక్స్ బెనిఫిట్స్ ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment