ఐపీఎల్ 2021: హైద‌రాబాద్ కు ఇంకో ఓట‌మి.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం..

May 2, 2021 7:29 PM

ఢిల్లీలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 28వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌డ‌బ‌డింది. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. ఏ ద‌శ‌లోనూ ప‌రుగులు చేద్దామ‌ని హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ అనుకోలేదు. చెత్త షాట్లు ఆడి వికెట్ల‌ను స‌మ‌ర్పించుకున్నారు. దీంతో హైద‌రాబాద్‌పై రాజ‌స్థాన్ 55 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

rajasthan won by 55 runs against hyderabad in ipl 2021 28th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్థాన్ 3 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్ల‌లో జాస్ బ‌ట్ల‌ర్‌, కెప్టెన్ సంజు శాంస‌న్‌లు రాణించారు. 64 బంతుల్లో బ‌ట్ల‌ర్ 11 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో 124 ప‌రుగులు చేశాడు. 33 బంతుల్లో శాంస‌న్ 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 48 ప‌రుగులు చేశాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్‌, విజ‌య్ శంక‌ర్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 165 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ ర‌హ‌మాన్‌, క్రిస్ మోరిస్‌లు 3 వికెట్ల చొప్పున ప‌డ‌గొట్టారు. కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాతియాల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment