క్రికెట్

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్‌పై మార్చి 2న స్పష్టత వచ్చే అవకాశం. Photo Credit: BCCI.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వర‌కు జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సోమ‌వారం (మార్చి 2, 2026) ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశ‌మై ఈ సీజ‌న్ తేదీల‌ను ఖ‌రారు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్ 2026 సీజ‌న్‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ సారి ఐపీఎల్ ఆల‌స్యం వెనుక ప‌లు కార‌ణాలు ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

కార‌ణాలు ఇవే..?

అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడుల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు, ప్లేయ‌ర్ల‌కు, ఇత‌ర సిబ్బందికి సెక్యూరిటీ క‌ల్పించ‌డం క‌ష్టంగా మారుతుంది. క‌నుక ఎన్నిక‌లు జ‌రిగే తేదీల‌ను మిన‌హాయించి మిగిలిన రోజుల్లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. కానీ ఆయా శాస‌న‌స‌భ‌ల‌కు ఎన్నిక‌ల తేదీల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై కూడా సందిగ్ధ‌త నెల‌కొంది. అందుక‌నే ఈసారి ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో అహ్మ‌దాబాద్‌, ముంబై, కోల్‌క‌తాల‌లో సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్ లు ఉన్నాయి. కానీ ఐపీఎల్‌కు సిద్ధం అవ్వాలంటే ఆ స్టేడియంలు ఇప్ప‌టికే ఖాళీగా ఉండాలి. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కార‌ణంగా ఇప్పుడు స్టేడియంలు ఖాళీ అయ్యే ప‌రిస్థితి లేదు. కాస్త స‌మ‌యం ప‌డుతుంది. క‌నుక ఈ కార‌ణంగా కూడా ఐపీఎల్ 2026ను ఈసారి ఆల‌స్యంగా నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది.

సిద్ధం కాని ఆర్‌సీబీ స్టేడియం..?

అయితే గ‌తేడాది అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ జ‌ర‌గ్గా అందులో ఆర్‌బీసీ జ‌ట్టు విజ‌యం సాధించి తొలిసారిగా ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ క్ర‌మంలో ఆర్‌సీబీ ఈసారి డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతోంది. అయితే ఆర్‌సీబీ సొంత మైదానం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కూడా భ‌ద్ర‌తా ప‌ర‌మైన ప్ర‌మాణాలు, సెక్యూరిటీ పెంపు వంటి మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు చేస్తున్నారు. క‌నుక ఆ మైదానం కూడా ఇంకా సిద్ధం కావ‌ల్సి ఉంది. ఇలా అన్ని అంశాలు క‌ల‌సి ఈసారి ఐపీఎల్ ఆల‌స్యం అయ్యేందుకు కార‌ణం అవుతున్నాయి. అయితే వ‌చ్చే వారంలో ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం గ‌న‌క జ‌రిగితే ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌పై స్ప‌ష్ట‌త వచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు…

Friday, 27 February 2026, 9:23 PM

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి…

Friday, 27 February 2026, 5:16 PM

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న…

Friday, 27 February 2026, 2:58 PM

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని…

Thursday, 26 February 2026, 9:41 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను…

Thursday, 26 February 2026, 6:59 PM

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన…

Thursday, 26 February 2026, 5:01 PM

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం…

Thursday, 26 February 2026, 1:20 PM

క్యాన్సర్ రిస్క్ తగ్గించే 5 ఆహారాలు: డాక్టర్ సౌరభ్ సెథి కీలక సూచనలు!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయ‌ని, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి క్యాన్స‌ర్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని, 5 ర‌కాల…

Thursday, 26 February 2026, 12:01 PM