వినోదం

‘మృత్యుంజయ్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. శ్రీ విష్ణు బర్త్ డే స్పెషల్!

శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ చిత్ర బృందానికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు. Photo Credit: Mrithyunjay Movie Team.

న‌టుడు శ్రీ విష్ణు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన మృత్యుంజ‌య్ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌యూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. సందీప్ గుణ్ణం, విన‌య చిల‌క‌పాటి సంయుక్తంగా తొలిసారిగా ఈ చిత్ర నిర్మాణం ద్వారా నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సందీప్‌కు ఎన్‌టీఆర్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న కార‌ణంగానే ఆయ‌న‌తో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయించార‌ని తెలుస్తోంది. తన స్నేహితుడి తొలి నిర్మాణాన్ని ఎన్‌టీఆర్ కూడా ప్ర‌శంసించారు. క‌థ ప్ర‌త్యేకంగా ఉంద‌ని, ట్రైల‌ర్ ఉత్కంఠ‌భ‌రితంగా ఉంద‌ని ఎన్‌టీఆర్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను మేక‌ర్స్ పంచుకున్నారు.

పోలీస్ అధికారి పాత్ర‌లో..

ఈ సినిమాలో శ్రీ విష్ణు ఓ పోలీస్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. క్రైమ్ బ్యూరో పోస్టింగ్ నిరాక‌రించ‌బ‌డిన త‌రువాత ఓ భ‌యాన‌క ర‌హ‌స్యాన్ని ఛేదించే ప్ర‌య‌త్నం ప్రారంభిస్తాడు. పిల్ల‌ల‌తో సంబంధం ఉన్న గూఢ‌చ‌ర్య సంకేతాలు, ఉత్కంఠ‌భ‌రిత చేజ్ స‌న్నివేశాలు చిత్ర క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా ముందుకు తీసుకెళ్తాయి. చివ‌ర్లో భావోద్వేగ మలుపుతో ఈ చిత్రం ముగుస్తుంద‌ని మేక‌ర్స్ తెలిపారు. ఇందులో ప‌రిశోధ‌నాత్మ‌క డ్రామా స‌న్నివేశాల‌ను, భావోద్వేగ అంశాల‌ను మేళ‌వించామ‌ని తెలిపారు.

మృత్యుంజ‌య్ సినిమాకు హుసేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఇందులో రెబా మోనికా జాన్ ఓ పోలీస్ అధికారిణి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇది ఆమెకు శ్రీ‌విష్ణుతో రెండో సినిమా కావ‌డం విశేషం. కాల భైర‌వ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న ఎంఎం కీర‌వాణి కుమారుడు. ఈ ప్రాజెక్టుకు ఇప్ప‌టికే ఎస్ఎస్ రాజ‌మౌళి, రామ్ పోతినేని త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు స‌పోర్ట్‌ను ఇచ్చారు. కాగా మృత్యుంజ‌య్ చిత్రం మార్చి 6, 2026న రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM