క్రికెట్

ఇంగ్లండ్‌ను కొట్టాలంటే అది కావాల్సిందే.. సంజు శాంసన్‌పై గంభీర్ ప్రశంసల జల్లు!

సంజు శాంసన్ ప్రతిభను కొనియాడిన కోచ్ గౌతమ్ గంభీర్. Photo Credit: CricTracker.

ఇంగ్లండ్ లాంటి జ‌ట్టును ఓడించాలంటే అందుకు ప్ర‌త్యేక ప్ర‌య‌త్నం అవ‌స‌ర‌మ‌ని భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నారు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో గంభీర్ త‌మ త‌దుపరి మ్యాచ్ గురించి వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సంజు శాంస‌న్ ఒక గొప్ప ప్లేయ‌ర్ అని, అత‌నికి టీం నుంచి కావ‌ల్సిన స‌పోర్ట్‌ను అన్ని విధాలుగా అందిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంజు ఆడిన మ్యాచ్‌ల‌న్నింటిలోనూ వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ అత‌నికి ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని, ఈ మ్యాచ్‌లో అత‌ను త‌న స‌త్తా ఏంటో చూపించాడ‌ని కొనియాడారు. సంజు ఒక అంత‌ర్జాతీయ స్థాయి ప్లేయ‌ర్ అని తాను ఏనాడో చెప్పాన‌ని గుర్తు చేశారు. సంజులో అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని, అత‌ను ఇలాంటి ఇన్నింగ్స్ మ‌రెన్నింటినో ఆడాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. అలాగే సెమీఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌బోతున్న నేప‌థ్యంలో ఆ మ్యాచ్ గురించి కూడా మాట్లాడారు.

ఇంగ్లండ్‌ను ఓడిస్తాం: గ‌ంభీర్

ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు ఒక వ‌ర‌ల్డ్ క్లాస్ టీమ్ అని గంభీర్ అన్నారు. అందులో ఉన్న ఆట‌గాళ్లు ఎంతో అద్భుత‌మైన ఆట ఆడుతార‌ని, అయితే ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఆ జ‌ట్టుతో ఆడ‌డం నిజంగా త‌మ‌కు స‌వాలేన‌ని అన్నారు. అయితే టీమిండియా మ‌రోమారు ప్ర‌త్యేకంగా ఆడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము అన్ని మ్యాచ్‌ల‌లోనూ శ‌క్తిమేర రాణిస్తూనే ఉన్నామ‌ని, కానీ ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌స్తుతం చాలా బ‌లంగా ఉంద‌ని అన్నారు. వారితో త‌ల‌ప‌డి గెల‌వాలంటే ప్ర‌త్యేక ప్ర‌య‌త్నం అవ‌స‌ర‌మ‌ని పున‌రుద్ఘాటించారు. ఇంగ్లండ్‌ను ఓడించి ఆదివారం అహ్మ‌దాబాద్‌లో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో ఆడుతామ‌ని గంభీర్ ధీమా వ్య‌క్తం చేశారు.

సంజు అజేయ ఇన్నింగ్స్‌..

వెస్టిండీస్‌తో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో సంజు శాంస‌న్ అద్భుతంగా రాణించిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సంజు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 195 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో భాగంగా టీమిండియా క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు సంజు ఓవైపు మంచి బంతుల‌ను డిఫెన్స్ ఆడుతూ సింగిల్స్ తీస్తూనే ఇత‌ర బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. ఈ క్ర‌మంలో అత‌ను 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. భార‌త్ ల‌క్ష్య ఛేద‌న‌లో 5 వికెట్ల‌ను కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. ఇక భార‌త్ సెమీఫైన‌ల్ 2లో భాగంగా మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే మార్చి 8వ తేదీన అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగే ఫైన‌ల్‌లో ఆడుతుంది. ఈ క్ర‌మంలో ఫ్యాన్స్ అంద‌రూ టీమిండియా మ‌రోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాల‌ని కోరుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM