Ganguly : భారత వన్డే క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తప్పించి అతని స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లిని వన్డే కెప్టెన్‌గా తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ మండిపడ్డారు. కాగా ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించారు.
విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్‌గా తప్పించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని గంగూలీ వెల్లడించారు. ఈ మేరకు గంగూలీ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. విరాట్ కోహ్లి 9 ఏళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్‌కు ఆడుతున్నాడు. 5 ఏళ్ల నుంచి కెప్టెన్‌గా ఉన్నాడు. అతనిపై ఎంతో ఒత్తిడి ఉంది.
టీ20లకు కెప్టెన్‌గా కోహ్లి ఇప్పటికే తప్పుకున్నాడు. వన్డేలకు కొనసాగుతానని చెప్పాడు. అయితే సెలెక్టర్లు మాత్రం తెల్ల బంతితో ఆడే క్రికెట్ ఫార్మాట్‌లు టీ20, వన్డేలకు ఒకే కెప్టెన్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అందుకనే కోహ్లిని తప్పించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అతనికి ముందే చెప్పాం. అతను అర్థం చేసుకున్నాడు.. అని గంగూలీ తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…