Bigg Boss 5 : గత ఏడాది తమన్నా ట్రాన్స్‌జెండర్‌గా బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి పెద్దగా అలరించలేకపోయింది. కానీ సీజన్ 5లో ట్రాన్స్‌జెండర్ కోటాలో వచ్చిన ప్రియాంక 13 వారాల పాటు హౌజ్‌లో ఉండి ఎంతగానో అలరించింది. అంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియని ప్రియాంక బిగ్ బాస్ తో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. బయటకు వచ్చాక ఆమెకు చాలా మంది నుండి ప్రశంసలు దక్కడమే కాకుండా గిఫ్ట్స్ కూడా అందుతున్నాయి.
తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ప్రియ.. ప్రియాంకకి డైమండ్ రింగ్ ను బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్ రింగ్ ఉంది.. ఇది నేను ఊహించలేదు. థాంక్ యూ, లవ్ యూ అక్కా.. అంటూ డైమండ్ రింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. దుబాయ్ నుండి ప్రియ భర్త ఆమె కోసం తీసుకొస్తే, దానిని ప్రియాంకకి గిఫ్ట్‌గా ఇచ్చి మంచి మనసు చాటుకుంది ప్రియ.
బిగ్ బాస్ సీజన్-5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఒక ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మొత్తం 91 రోజుల పాటు హౌజ్‌లో ఉంది. దీంతో ప్రియాంక ఓ వైపు అభిమానులతోపాటు మరో వైపు డబ్బులు కూడా బాగానే సంపాదించింది.
ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి లక్ష రూపాయలకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అంటే 13 వారాలకు మొత్తంగా దాదాపు పదమూడు లక్షలకు పైగానే సంపాదించినట్టు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…