Bigg Boss 5 : ప్రియాంక‌కు డైమండ్ రింగ్ ను గిఫ్ట్‌గా ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్..!

December 13, 2021 11:42 AM

Bigg Boss 5 : గ‌త ఏడాది త‌మ‌న్నా ట్రాన్స్‌జెండ‌ర్‌గా బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. కానీ సీజ‌న్ 5లో ట్రాన్స్‌జెండ‌ర్ కోటాలో వ‌చ్చిన ప్రియాంక 13 వారాల పాటు హౌజ్‌లో ఉండి ఎంతగానో అల‌రించింది. అంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియని ప్రియాంక బిగ్ బాస్ తో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమెకు చాలా మంది నుండి ప్ర‌శంస‌లు ద‌క్క‌డ‌మే కాకుండా గిఫ్ట్స్ కూడా అందుతున్నాయి.

Bigg Boss 5 priya given diamond ring gift to priyanka singh

తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ ప్రియ‌.. ప్రియాంక‌కి డైమండ్ రింగ్ ను బహుమ‌తిగా ఇచ్చింది. ఈ విషయాన్ని పింకీ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అక్క ఇచ్చిన బహుమతి తెరచి చూడగానే ఒక్కసారిగా షాకయ్యాను. అందులో డైమండ్‌ రింగ్‌ ఉంది.. ఇది నేను ఊహించలేదు. థాంక్‌ యూ, లవ్‌ యూ అక్కా.. అంటూ డైమండ్‌ రింగ్‌ ఫొటోను పోస్ట్‌ చేసింది. దుబాయ్ నుండి ప్రియ భ‌ర్త ఆమె కోసం తీసుకొస్తే, దానిని ప్రియాంక‌కి గిఫ్ట్‌గా ఇచ్చి మంచి మ‌న‌సు చాటుకుంది ప్రియ‌.

బిగ్ బాస్ సీజన్‌-5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఒక ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మొత్తం 91 రోజుల పాటు హౌజ్‌లో ఉంది. దీంతో ప్రియాంక ఓ వైపు అభిమానులతోపాటు మరో వైపు డబ్బులు కూడా బాగానే సంపాదించింది.

ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి లక్ష రూపాయలకు పైగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చినట్టు సమాచారం. అంటే 13 వారాలకు మొత్తంగా దాదాపు పదమూడు లక్షలకు పైగానే సంపాదించినట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now