ఉప్పుతో ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ చిటికెలో మాయం.. ఇంట్లో ఇంక డబ్బే డబ్బు..!

October 30, 2022 11:03 AM

ప్రతి ఒక్కరికీ ఆర్థిక కష్టాలుంటాయి. అప్పులు, వడ్డీలు కట్టుకోలేక మానసికంగా, శారీరకంగా ఇబ్బది పడుతుంటారు. అయితే అలా కష్టాలు పుడుతున్న వారు ఉప్పుతో ఈ చిట్కా పాటిస్తే కచ్చితంగా కొంత మేర ఉపశమనం పొందగలుగుతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనందరం ఇంట్లో ఆహారపు రుచిని పెంచడానికి కచ్చితంగా ఉప్పును ఉపయోగిస్తాం. అయితే ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా. ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అందుకోసం ఇలా చేయండి.

ఉప్పంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని వారు చెబుతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని చాలామంది చెబుతుంటారు. ఉప్పును ఉపయోగించి మనం సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు. దీని కోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో డబ్బును ఉంచాలి. ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి మరుసటి రోజూ బీరువాలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే మంగళవారం రాత్రి పూట ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి.

do like this with salt and money for money problems

మరుసటి రోజు అనగా బుధవారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో పోయాలి. ఇలా చేసిన వారికి ఆ వారమంతా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులంటున్నారు. ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుంది. అలాగే ఒక గాజు గిన్నెలో 2 చెంచాల ఉప్పు, నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. రుణ బాధలు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైన చెప్పినవి పాటించి ధనలాభం పొంది ఆనందంగా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now