Vespa Scooter Price : పూర్వకాలంలో మన పెద్దలకు ఉన్న ఆహారపు అలవాట్లు మనకు లేవు. వారు అత్యంత స్వచ్ఛమైన ఆహారం తినేవారు. అలాగే బలవర్ధకమైన ఆహారం తీసుకునేవారు. అందుకనే వారు ఎక్కువ రోజుల పాటు బతుకుతున్నారు. అలాగే వారికి వృద్ధాప్యం వచ్చినా వ్యాధులు రావట్లేదు. కేవలం ఇదే కాదు.. ఇంకా అనేక విషయాల్లో అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అప్పట్లో ఉన్న ధరలు చాలా తక్కువ. పూర్వకాలంలో రూ.100 ఉంటే కోటీశ్వరుల కిందే లెక్క. కానీ ఇప్పుడు రూ.100 పెడితే బిర్యానీ కూడా రాదు. అంతలా ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
ఇక ఒకప్పుడు ఎంతో ఫేమస్ అయిన బజాజ్ చేతక్, వెస్పా లాంటి స్కూటర్లు ఇప్పుడు మళ్లీ మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ అప్పట్లో కారు కాదు.. స్కూటర్ ఉంటేనే చాలా గొప్ప. అప్పట్లో ఒక వెస్పా స్కూటర్ ధర ఎంత ఉండేదో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ ఫొటో కాస్తా వైరల్ అవుతోంది. అప్పట్లో అమ్మిన వెస్పా స్కూటర్ ధర రూ.2243 ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఈ ధరను చూస్తే చాలా మంది షాకవుతారు. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్లే వస్తున్నాయి. కనీసం రూ.1 లక్ష లేనిది స్కూటర్ రావడం లేదు. అంటే.. అప్పటి ధరతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో వందల రెట్లు ధర పెరిగిందని చెప్పవచ్చు.
ఇక అప్పట్లో ఒక సెకండ్ హ్యాండ్ కారు ధర రూ.5వేలుగా ఉండేది. అలాగే ఒక దోశను 12 పైసలకు విక్రయించేవారు. ఒక గప్‌చుప్ ధర కూడా అంతే ఉండేది. అప్పట్లో ప్రైవేటు స్కూల్‌కు వెళితే నెలకు రూ.10 నుంచి రూ.15 వసూలు చేసేవారు. అప్పట్లో రూ.20వేలు పెడితే అపార్ట్‌మెంట్‌లో ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వచ్చేది. ఇలా అప్పటి ధరలను చూస్తే ఇప్పటి వరకు ఎంతైన ఆశ్చర్యపోతారు. కానీ అప్పట్లో చాలా మంది దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇక ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నా.. ఆ డబ్బులకు ఇప్పుడు ఉన్న వస్తువులు రావడం లేదు. ఇంకా ముందు ముందు రేట్లు ఎంతలా పెరుగుతాయో చూడాలి.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…