Vespa Scooter Price : అప్ప‌ట్లో ఒక స్కూటర్ ధ‌ర ఎంతో చూశారా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

January 15, 2026 9:13 PM

Vespa Scooter Price : పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌ల‌కు ఉన్న ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌కు లేవు. వారు అత్యంత స్వ‌చ్ఛ‌మైన ఆహారం తినేవారు. అలాగే బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తీసుకునేవారు. అందుక‌నే వారు ఎక్కువ రోజుల పాటు బ‌తుకుతున్నారు. అలాగే వారికి వృద్ధాప్యం వ‌చ్చినా వ్యాధులు రావ‌ట్లేదు. కేవ‌లం ఇదే కాదు.. ఇంకా అనేక విష‌యాల్లో అప్ప‌టికి ఇప్ప‌టికి ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా అప్ప‌ట్లో ఉన్న ధ‌ర‌లు చాలా త‌క్కువ‌. పూర్వ‌కాలంలో రూ.100 ఉంటే కోటీశ్వ‌రుల కిందే లెక్క‌. కానీ ఇప్పుడు రూ.100 పెడితే బిర్యానీ కూడా రాదు. అంత‌లా ధ‌ర‌లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

ఇక ఒక‌ప్పుడు ఎంతో ఫేమ‌స్ అయిన బ‌జాజ్ చేత‌క్‌, వెస్పా లాంటి స్కూట‌ర్లు ఇప్పుడు మ‌ళ్లీ మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. కానీ అప్ప‌ట్లో కారు కాదు.. స్కూట‌ర్ ఉంటేనే చాలా గొప్ప‌. అప్ప‌ట్లో ఒక వెస్పా స్కూట‌ర్ ధ‌ర ఎంత ఉండేదో ఒక వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. ఆ ఫొటో కాస్తా వైర‌ల్ అవుతోంది. అప్ప‌ట్లో అమ్మిన వెస్పా స్కూట‌ర్ ధ‌ర రూ.2243 ఉండ‌డాన్ని మీరు గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ ధ‌ర‌ను చూస్తే చాలా మంది షాక‌వుతారు. ఇప్పుడు అన్నీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లే వ‌స్తున్నాయి. క‌నీసం రూ.1 ల‌క్ష లేనిది స్కూట‌ర్ రావ‌డం లేదు. అంటే.. అప్ప‌టి ధ‌ర‌తో పోలిస్తే ఇప్పుడు ఎన్నో వంద‌ల రెట్లు ధ‌ర పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Vespa Scooter Price in old days have you seen it
Vespa Scooter Price

ఇక అప్ప‌ట్లో ఒక సెకండ్ హ్యాండ్ కారు ధ‌ర రూ.5వేలుగా ఉండేది. అలాగే ఒక దోశ‌ను 12 పైస‌ల‌కు విక్ర‌యించేవారు. ఒక గ‌ప్‌చుప్ ధ‌ర కూడా అంతే ఉండేది. అప్ప‌ట్లో ప్రైవేటు స్కూల్‌కు వెళితే నెల‌కు రూ.10 నుంచి రూ.15 వ‌సూలు చేసేవారు. అప్ప‌ట్లో రూ.20వేలు పెడితే అపార్ట్‌మెంట్‌లో ఒక డ‌బుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వ‌చ్చేది. ఇలా అప్ప‌టి ధ‌ర‌ల‌ను చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతైన ఆశ్చ‌ర్య‌పోతారు. కానీ అప్ప‌ట్లో చాలా మంది ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండేవి కావు. ఇక ఇప్పుడు డ‌బ్బులు సంపాదిస్తున్నా.. ఆ డ‌బ్బుల‌కు ఇప్పుడు ఉన్న వ‌స్తువులు రావడం లేదు. ఇంకా ముందు ముందు రేట్లు ఎంత‌లా పెరుగుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now