School Van Driver : రోడ్డు ప్రమాదాలు అనేవి అనేక కారణాల వల్ల జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాలు మనకు చెప్పకుండానే చోటు చేసుకుంటాయి. ఎప్పుడు రోడ్డుపై ఏం ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ అలాంటి ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినప్పుడు తన ప్రాణం పోతుందని తెలిసినా ఇతరుల ప్రాణాలను కాపాడేవారే నిజమైన హీరో అనిపించుకుంటారు. అవును.. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
తమిళనాడులోని తిరుప్పుర్ జిల్లా వెల్లకొయిల్ అనే ప్రాంతంలో ఉన్న ఏఎన్‌వీ మ్యాట్రిక్ స్కూల్‌లో సెమలయ్యప్పన్ (49) అనే వ్యక్తి వ్యాన్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అదే వ్యాన్‌లో అతని భార్య హెల్పర్‌గా పనిచేస్తోంది. అయితే జూలై 24వ తేదీన యథావిధిగా అతను స్కూల్ నుంచి 20 మంది పిల్లలను వ్యాన్‌లో ఎక్కించుకుని వారిని ఇంటి దగ్గర దింపేందుకు తీసుకెళ్తున్నాడు. కాగా మార్గమధ్యలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
పిల్లలను ఎక్కించుకుని వ్యాన్ నడిపిస్తున్న సెమలయ్యప్పన్ కు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. అయితే అతను అంతటి స్థితిలోనూ జాగరూకతతో వ్యవహరించాడు. ఓ వైపు తన ప్రాణాలు పోతున్నా కూడా తన కర్తవ్య నిర్వహణను ఆపలేదు. రోడ్డు మధ్యలో ఉన్న వ్యాన్‌ను ముందుగా రోడ్డు పక్కన ఆపేశాడు. దీంతో వ్యాన్‌కు ఎలాంటి ప్రమాదం జరగకుండా పిల్లలు సురక్షితం అయ్యారు. అయితే వ్యాన్‌ను రోడ్డు పక్కన ఆపేయగానే వెంటనే సెమలయ్యప్పన్ తన సీట్‌లో కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే స్టీరింగ్‌పై ఒరిగిపోయాడు.
కాగా ఇది చూసిన స్థానికులు వెంటనే అతన్ని ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కానీ అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే అతను చేసిన పనికి అందరూ అతని తెగువను అభినందిస్తున్నారు. తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా పిల్లల ప్రాణాలు కాపాడి చాలా జాగ్రత్తగా వ్యవహరించాడని అందరూ అతన్ని కొనియాడుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెక్కు రూపంలో అందజేసింది. అలాగే ఆ స్కూల్ పిల్లలు అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…