కొందరికి అదృష్టం మరీ జలగల్లా పడుతుంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. సరిగ్గా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ జాలరి కొన్ని ప్రత్యేకమైన జాతికి చెందిన చేపలను పట్టాడు. వాటిని అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పాల్‌ఘడ్ జిల్లాలో ఉన్న ముర్బెకు చెందిన చంద్రకాంత్ తారే ఆగస్టు 15న ఇంకొందరు జాలర్లతో కలిసి వాధ్‌వన్ జిల్లాలోని తీర ప్రాంతం నుంచి 25 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే ఆగస్టు 28న అతను ఘోల్ (Ghol) అనే జాతికి చెందిన ప్రత్యేకమైన చేపలను పట్టాడు. మొత్తం 157 ఘోల్ చేపలను పట్టాడు. తరువాత వాటికి ముర్బెలో వేలం నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన కొందరు వర్తకులు మొత్తం 157 చేపలను రూ.1.33 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఆ జాలరి పంట పండింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
కాగా ఘోల్ చేపలను Sea Gold చేపలు అని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత ఖరీదైన చేపల జాతిలో ఒకటి. ఇవి మన దేశంలోని సముద్రాల్లో చాలా తక్కువగా లభిస్తాయి. కాలుష్యం కారణంగా ఈ చేపలు అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరాయి. ఈ చేపలను పట్టేందుకు మత్స్యకారులు కొన్ని సార్లు సముద్రంలో చాలా లోతు వరకు గాలం వేయాల్సి ఉంటుంది.
ఇండోనేషియా, థాయ్‌లాండ్, హాంగ్ కాంగ్, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఘోల్ చేపలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఈ చేపలు ఎక్కువ ధర పలుకుతాయి. వీటి నుంచి తీసే పలు పదార్థాలతో మందులను తయారు చేస్తారు. ఈ చేపల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఇవి అత్యంత ఆరోగ్యకరమైన చేపలుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ జాలరికి ఈ చేపలు లభించడం వల్ల అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…