టాయిలెట్‌ సీట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా ?

July 4, 2021 11:12 AM

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మనకు టాయిలెట్లు రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఇండియన్‌ టైప్‌. రెండోది వెస్ట్రన్‌ టైప్‌. విదేశాల్లో చాలా దేశాల్లో వెస్ట్రన్‌ టైప్‌ టాయిలెట్లను ఉపయోగిస్తారు. ఇక మన దేశంలో చాలా మంది ఇండియన్‌ తరహా టాయిలెట్లను వాడుతారు. కొందరి ఇళ్లల్లో వెస్ట్రన్‌ టాయిలెట్లు ఉంటాయి. అయితే ఏ టాయిలెట్‌ సీట్‌ అయినా సరే దాదాపుగా తెలుపు రంగులోనే ఉంటుంది. అవును.. గమనించారు కదా. అయితే టాయిలెట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

do you know why toilet seats are in white color

టాయిలెట్‌ సీట్స్‌ను సాధారణంగా పోర్సిలెయిన్‌ అనే సెరామిక్‌ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అది సహజంగానే తెలుపు రంగులో ఉంటుంది. దానికి ఇతర రంగులను కలపాల్సిన పనిలేదు. పైగా అలా ఉంచితేనే తక్కువ ధర ఉంటాయి. రంగులు కలిపితే ధర పెంచాల్సి వస్తుంది. అందుకని వాటిని తయారు చేశాక వాటికి వచ్చే సహజమైన తెలుపు రంగులోనే వాటిని ఉంచుతారు. అలాగే విక్రయిస్తారు. అందుకనే టాయిలెట్‌ సీట్లు సహజంగానే ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి.

ఇక తెలుపు కాకుండా మిగిలిన ఏ రంగుల్లో టాయిలెట్‌ సీట్లు ఉన్నా సరే వాటిపై మురికి సరిగ్గా కనిపించదు. తెలుపు రంగు అయితేనే మురికి సరిగ్గా కనిపిస్తుంది. పైగా తెలుపు రంగుతో ఉన్న టాయిలెట్‌ సీట్‌ను క్లీన్‌ చేస్తే అది తెల్లగా మెరుస్తుంది. దీంతో సంతృప్తి కలుగుతుంది. అదే ఇతర రంగుల్లో ఉండే టాయిలెట్‌ సీట్లను శుభ్రం చేసినా తెలుపులా మెరవవు. కనుక సీట్‌ శుభ్రం అయిందా, కాలేదా అనే విషయం గుర్తించడం కష్టతరం అవుతుంది. అందుకనే టాయిలెట్‌ సీట్లను సహజంగానే తెలుపు రంగులో ఉండేట్లు తయారు చేస్తారు. అలాగే విక్రయిస్తారు. అవి ఎక్కువగా తెలుపు రంగులోనే ఉండడం వెనుక ఈ కారణాలు ఉన్నాయన్నమాట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment