వెజిటేరియ‌న్లు ఎన్ని ర‌కాలో.. వారికి ఉండే పేర్లు ఏమిటో తెలుసా ?

August 20, 2021 9:13 PM

శాకాహారం తినేవారిని వెజిటేరియ‌న్లు అని.. మాంసాహారం తినే వారిని నాన్ వెజిటేరియ‌న్లు అని పిలుస్తార‌న్న సంగతి తెలిసిందే. అయితే మాంసాహారం తినేవారిని ప‌క్క‌న పెడితే శాకాహారం తినేవారిలో వివిధ ర‌కాల వెజిటేరియ‌న్లు ఉంటారు. అవును.. వాళ్ల‌కు పేర్లు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

వెజిటేరియ‌న్లు ఎన్ని ర‌కాలో.. వారికి ఉండే పేర్లు ఏమిటో తెలుసా ?

* పూర్తిగా శాకాహారం మాత్ర‌మే తినేవారిని ప్యూర్ వెజిటేరియ‌న్ అంటారు.

* చికెన్‌, మ‌ట‌న్ వంటివి తిన‌కుండా గుడ్ల‌ను మాత్ర‌మే తినే వెజిటేరియ‌న్ల‌ను ఎగిటేరియ‌న్ అంటారు.

* చికెన్‌, మ‌ట‌న్, గుడ్ల‌ను తిన‌కుండా, గుడ్లతో చేసే కేక్‌ల‌ను మాత్ర‌మే తినే వారిని కేకిటేరియ‌న్ అంటారు.

* చికెన్‌, మ‌ట‌న్‌, గుడ్ల‌ను తిన‌కుండా వాటితో త‌యారు చేసే కూర‌ల్లోని సూప్‌ను మాత్ర‌మే తీసుకునేవారిని గ్రేవిటేరియ‌న్ అంటారు.

* కేవ‌లం బ‌య‌ట మాత్ర‌మే నాన్ వెజ్ తినేవారిని, ఇంట్లో నాన్ వెజ్ తిన‌ని వారిని రిస్ట్రిక్టేరియ‌న్ అంటారు.

* మ‌ద్యం తాగేట‌ప్పుడు మాత్ర‌మే నాన్ వెజ్ తినే వారిని, మిగిలిన స‌మ‌యాల్లో నాన్ వెజ్ తిన‌ని వారిని బూజిటేరియ‌న్ అంటారు.

* ఎవ‌రైనా ఫోర్స్ చేసి బ‌ల‌వంత పెడితే నాన్ వెజ్ తినేవారిని ఫోర్సిటేరియ‌న్ అంటారు.

* దైవం పేరు చెప్పి వారంలో కొన్ని రోజుల్లో నాన్ వెజ్ తిన‌కుండా మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ తినేవారిని కాలెంటేరియ‌న్ అంటారు.

ఇక ఇప్పుడు చెప్పండి.. మీరు వీటిలో దేని కింద‌కైనా చెందుతారా ?

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment