8 ఏళ్ల కింద చ‌నిపోయిన బాలుడు.. పున‌ర్జ‌న్మించి వ‌చ్చాన‌ని చెబుతున్న ఇంకో బాలుడు.. అంద‌రినీ గుర్తు కూడా ప‌డుతున్నాడు..!

August 20, 2021 8:52 PM

మ‌నుషులు చ‌నిపోయాక మ‌ళ్లీ ఇంకొక‌రికి పుట్ట‌డాన్ని పున‌ర్జ‌న్మ అంటారు. ఇది నిజంగా ఉందో లేదో తెలియదు కానీ.. సినిమాల్లో అయితే మ‌నం చాలా చూశాం. ఒక‌రికి పుట్టిన వారు చ‌నిపోయి పున‌ర్జ‌న్మించి ఇంకొక‌రికి పుడుతుంటారు. త‌రువాత వారికి గ‌త జ‌న్మ తాలూకు విష‌యాలు గుర్తుకు వ‌స్తాయి. ఈ విధంగా సినిమాల్లోనే జ‌రుగుతుంటుంది. వాస్త‌వ జీవితంలో అస‌లు జ‌ర‌గ‌దు. కానీ ఇప్పుడు చెప్పే సంఘ‌ట‌న గురించి తెలిస్తే నిజంగా అలా జ‌రుగుతుంద‌ని మీరు కూడా న‌మ్ముతారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

8 ఏళ్ల కింద చ‌నిపోయిన బాలుడు.. పున‌ర్జ‌న్మించి వ‌చ్చాన‌ని చెబుతున్న ఇంకో బాలుడు.. అంద‌రినీ గుర్తు కూడా ప‌డుతున్నాడు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా నాగ్లా స‌లేహి గ్రామానికి చెందిన ప్ర‌మోద్ కుమార్ అనే వ్య‌క్తి కుమారుడు రోహిత్ కుమార్ మే 4, 2013న చ‌నిపోయాడు. స‌మీపంలో ఉన్న కెనాల్‌లో స్నానానికి వెళ్లి అందులో మునిగి మృతి చెందాడు.

అయితే ఆ గ్రామానికి స‌మీపంలో ఉన్న రామ్ న‌రేష్ శంఖ్‌వార్ అనే వ్య‌క్తి కుమారుడు చంద్ర‌వీర్ అలియాస్ ఛోటు ఇటీవ‌ల ప్ర‌మోద్ కుమార్ ఇంటికి వ‌చ్చి తాను గ‌త జ‌న్మ‌లో రోహిత్ కుమార్ అని చెప్పాడు. అంతేకాదు, రోహిత్ కుటుంబ స‌భ్యులంద‌రినీ గుర్తు ప‌ట్టాడు. ఈ క్ర‌మంలో అత‌న్ని రోహిత్ చ‌దివిన స్కూల్‌కు కూడా తీసుకెళ్లారు. అక్క‌డ ఛోటు అంద‌రినీ గుర్తు ప‌ట్టాడు. దీంతో గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా రామ్ న‌రేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ త‌న కుమారుడు ఛోటు ఎప్పుడూ గ‌త జ‌న్మ గురించి చెప్పేవాడ‌ని, కానీ అత‌ను త‌మ నుంచి దూరం అవుతాడ‌ని భ‌యం వేసి అత‌న్ని నాగ్లా స‌లేహి గ్రామానికి పంపించేవాళ్లం కాద‌ని, కానీ ఇప్పుడు రాక త‌ప్ప‌లేద‌ని తెలిపాడు. ఏది ఏమైనా ఒక‌ప్పుడు చ‌నిపోయాడ‌నుకున్న బాలుడు ఇప్పుడు మ‌ళ్లీ వ‌చ్చి తాను పున‌ర్జ‌న్మించాన‌ని చెబుతుండ‌డం, అంద‌రినీ గుర్తు ప‌డుతుండ‌డం నిజంగానే అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment