Kajal Aggarwal : భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అందులోనూ కొరటాల శివ డైరెక్షన్ కావడంతో సినిమా హిట్ అనుకున్నారు. కానీ ఆ సినిమా దారుణంగా నిరాశపరచింది. మెగా అభిమానులు కూడా ఈ సినిమాను చూసి నీరసించిపోయారు. అయితే అందరిది ఒక బాధ అయితే వీడిది ఒక బాధ. ఈ సినిమాలో కాజల్ లేదని నానా హంగామా చేశాడు. ఏకంగా కిందపడి ఏడ్చేశాడు కూడా. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాజల్ లేదంటూ వాడు చేసిన హడావిడికి చుట్టు పక్కల జనాలు షాక్ అయ్యారు. సినిమా బాగుందని చెబుతూనే మధ్య మధ్యలోకాజల్ పేరు ప్రస్తావిస్తూ నానా హంగామా చేశాడు. మనోడు గతంలో పలు సినిమా థియేటర్‌ల వద్ద కూడా ఇలాంటి రచ్చనే చేశాడు. అయితే మనోడి స్పెషాలిటి ఏంటంటే సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన వారిని ఎలివేట్ చేస్తూ డైలాగులు చెబుతుంటాడు. ఈ వీడియో చూస్తే మీరు పడి పడి నవ్వుతారు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ సిద్ధ అనే ముఖ్య పాత్ర పోషించాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డె నటించింది. చిరంజీవి సరసన కాజల్‌ను తీసుకుని కొన్నిసన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపారు. లాహే సాంగ్‌లో కాజల్ కనిపించింది. కానీ ట్రైలర్‌లో చూపించకపోవడంతో అనుమానాలు పుట్టుకొచ్చాయి. దానిపై ఇటీవల ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు కొరటాల. కాజల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతోనే ఆమెను తీసేసినట్లు పేర్కొన్నారు. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగుండదని, అంత పెద్ద హీరోయిన్‌తో అలాంటి పాత్ర చేయిస్తే బాగుండదని అనిపించిందని.. అందుకనే ఈ సినిమాలోనుంచి ఆమె సీన్లను తొలగించామని తెలిపారు.
కాజల్ ఈ సినిమాలో నటించనప్పటికీ కాజల్ తన పారితోషికాన్ని పూర్తిగా అందుకుందని, అందుకే సైలెంట్ గా ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు కోటిన్నర రూపాయలు అందుకున్నట్టు సమాచారం. అయితే కాజల్ లేదని అతగాడు నానా హంగామా చేయడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…