Windows 11 : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్.. తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11ను మంగళవారం అక్టోబర్ 5న విడుదల చేసింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మైక్రోసాఫ్ట్ ఇంతకు ముందే ప్రకటన చేసింది. దీంతో చెప్పిన విధంగానే విండోస్ 11ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వినియోగదారులు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌లలో ఇన్‌బిల్ట్‌గా అందించే ఓఎస్ ఇదే కానుంది.
ఇక విండోస్ 11ను కంప్యూటర్లలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విండోస్ 11 అప్‌డేట్ వస్తే Settings > Windows Update లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. అయితే అప్‌డేట్ వచ్చిందని మెసేజ్ రాకపోతే అప్పుడు.. విండోస్ 11 సాఫ్ట్‌వేర్ డౌన్ లోడ్ పేజ్‌కు వెళ్లి అక్కడ Download Now అనే బటన్‌పై క్లిక్ చేసి తెర మీద వచ్చే సూచనలను ఫాలో కావాల్సి ఉంటుంది.
తరువాత పేజీలో క్రియేట్ విండోస్ 11 ఇన్‌స్టాలేషన్ మీడియాపై క్లిక్ చేయాలి. దీంతో బూటబుల్ యూఎస్‌బీ లేదా డీవీడీ తో ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారు చేయవచ్చు. దాన్ని ఉపయోగించి విండోస్ 11ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
లేదా విండోస్ 11కు చెందిన డిస్క్ ఇమేజ్ (ఐఎస్‌వో)ను డౌన్ లోడ్ చేసి కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. అయితే కొన్ని పాతతరం పీసీల్లో విండోస్ 11 రాదు. విండోస్ 11 పనిచేయాలంటే అందుకు కంప్యూటర్‌లో కనీస కాన్ఫిగరేషన్ ఉండాలి. అది ఇలా ఉంది.
విండోస్ పీసీలో ప్రాసెసర్ 1 గిగాహెడ్జ్ ఉండాలి. కనీస ర్యామ్ 4జీబీ వరకు ఉండాలి. 64జీబీ స్టోరేజ్ హార్డ్ డిస్క్‌లో అందుబాటులో ఉండాలి. డైరెక్ట్ ఎక్స్ 12 ను సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అలాగే హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే ఉండాలి. విండోస్ 10 లేదా 20హెచ్1 ఆపైన వెర్షన్ ఉన్న వినియోగదారులందరూ విండోస్ 11ను డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…