Windows 11 : మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వ‌చ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి..!

October 5, 2021 10:41 PM

Windows 11 : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌.. త‌న కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ విండోస్ 11ను మంగ‌ళ‌వారం అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేసింది. ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ గురించి మైక్రోసాఫ్ట్ ఇంత‌కు ముందే ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో చెప్పిన విధంగానే విండోస్ 11ను అందుబాటులోకి తెచ్చింది. ఇక‌పై వినియోగ‌దారులు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ల‌లో ఇన్‌బిల్ట్‌గా అందించే ఓఎస్ ఇదే కానుంది.

Windows 11 launched by microsoft how to install it in your pc

ఇక విండోస్ 11ను కంప్యూట‌ర్ల‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విండోస్ 11 అప్‌డేట్ వ‌స్తే Settings > Windows Update లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయ‌వ‌చ్చు. అయితే అప్‌డేట్ వ‌చ్చింద‌ని మెసేజ్ రాక‌పోతే అప్పుడు.. విండోస్ 11 సాఫ్ట్‌వేర్ డౌన్ లోడ్ పేజ్‌కు వెళ్లి అక్క‌డ Download Now అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేసి తెర మీద వ‌చ్చే సూచ‌న‌ల‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.

త‌రువాత పేజీలో క్రియేట్ విండోస్ 11 ఇన్‌స్టాలేష‌న్ మీడియాపై క్లిక్ చేయాలి. దీంతో బూట‌బుల్ యూఎస్‌బీ లేదా డీవీడీ తో ఇన్‌స్టాలేష‌న్ డిస్క్ త‌యారు చేయ‌వ‌చ్చు. దాన్ని ఉప‌యోగించి విండోస్ 11ను ఇన్‌స్టాల్ చేయ‌వ‌చ్చు.

లేదా విండోస్ 11కు చెందిన డిస్క్ ఇమేజ్ (ఐఎస్‌వో)ను డౌన్ లోడ్ చేసి కూడా ఇన్‌స్టాల్ చేయ‌వ‌చ్చు. అయితే కొన్ని పాత‌త‌రం పీసీల్లో విండోస్ 11 రాదు. విండోస్ 11 ప‌నిచేయాలంటే అందుకు కంప్యూట‌ర్‌లో క‌నీస కాన్ఫిగ‌రేష‌న్ ఉండాలి. అది ఇలా ఉంది.

విండోస్ పీసీలో ప్రాసెస‌ర్ 1 గిగాహెడ్జ్ ఉండాలి. క‌నీస ర్యామ్ 4జీబీ వ‌ర‌కు ఉండాలి. 64జీబీ స్టోరేజ్ హార్డ్ డిస్క్‌లో అందుబాటులో ఉండాలి. డైరెక్ట్ ఎక్స్ 12 ను స‌పోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అలాగే హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లే ఉండాలి. విండోస్ 10 లేదా 20హెచ్‌1 ఆపైన వెర్ష‌న్ ఉన్న వినియోగ‌దారులంద‌రూ విండోస్ 11ను డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now