NTR : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరికీ జంటగా అలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీగా అంచనాలున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయం అయినా కొద్ది నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడబోతున్నాడని అంటున్నారు. ఇంతకుముందు ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకుప్రేమతో’ పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా ‘చక్రవ్యూహా’ సినిమాల్లో తారక్ పాడిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో జక్కన్న, కీరవాణి కలిసి ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్‌తో ఓ ఎనర్జిటిక్ సాంగ్ పాడించారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు దీనిని కొట్టి పారేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది. రెండో పాటతో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించిన జక్కన్న మూడో పాటకు ముహూర్తం పెట్టాడట. ఈ నెల 24న మూడో పాటను విడుదల చేయబోతున్నాడట. ఈ పాట రిలీజ్ డేట్ తోపాటు టైమ్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…