NTR : ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడ‌బోతున్నాడా.. ఇందులో నిజమెంత‌?

November 22, 2021 7:46 PM

NTR : ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ అనే సినిమాని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరికీ జంటగా అలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీగా అంచనాలున్నాయి.

will NTR  sing a song for rrr movie

ఈ సినిమాకి సంబంధించిన ఏ విష‌యం అయినా కొద్ది నిమిషాల‌లో వైర‌ల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పాట పాడ‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఇంతకుముందు ‘యమదొంగ’, ‘కంత్రీ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకుప్రేమతో’ పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ సినిమా ‘చక్రవ్యూహా’ సినిమాల్లో తారక్ పాడిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో జక్కన్న, కీరవాణి కలిసి ‘ఆర్ఆర్ఆర్’ లో యంగ్ టైగర్‌తో ఓ ఎనర్జిటిక్ సాంగ్ పాడించారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొంద‌రు దీనిని కొట్టి పారేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతోంది. రెండో పాటతో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించిన జక్కన్న మూడో పాటకు ముహూర్తం పెట్టాడట. ఈ నెల 24న మూడో పాటను విడుదల చేయబోతున్నాడట. ఈ పాట రిలీజ్ డేట్ తోపాటు టైమ్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now