Puneeth Rajkumar : పాన్ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఇటీవలె విడుదలైన మాస్ సాంగ్ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట, ఎవరు డ్యాన్స్ చేసినా ఇవే స్టెప్స్. 10 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్‌ను ఇప్పటికే చాలామంది నెటిజన్లు రీక్రియేట్ చేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇటీవల బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సోహేల్, మెహబూబ్.. నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే మాస్ స్టెప్పులేశారు.
చాలా మంది నెటిజన్లు తమ అభిమాన స్టార్ హీరోల మాషప్ సాంగ్స్ కి నాటు నాటు ట్యూన్ ని జోడిస్తున్నారు. వీటిలో కొన్ని క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ డ్యాన్సులతో నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్ ప్రతి ఒక్కరి మనసును దోచుకుంటోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నృత్యకారులలో పునీత్ ఒకరు. అతని స్టైల్‌లో రూపొందించిన నాటు నాటు సాంగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
పునీత్ దురదృష్టవశాత్తూ గత నెలలో ఆకస్మికంగా గుండె పోటు కారణంగా మరణించారు. అతని అభిమానులు నాటు నాటు మాషప్ వీడియోలతో సంస్మరించుకోవడం హృదయాల్ని టచ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ అంతటా వైరల్ అవుతోంది. అది చివరికి ఆర్ఆర్ఆర్ టీమ్ కి కూడా చేరింది. ఇది అద్భుతమైన కూర్పు అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రశంసించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…