Jr NTR : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. ఆయనపై ఎలాంటి రూమర్స్ వచ్చిన కూడా వాటిని పట్టించుకోకుండా ఆయన ఎంతో సాధారణంగా ఉంటారు. ఒక స్టార్ హీరోకి మరో స్టార్ హీరోకి వ్యక్తిగతంగా కన్నా సినిమా పరంగా ఎన్నో సార్లు ఢీకొట్టే సందర్భాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెగాస్టార్ మరియు నందమూరి ఫ్యామిలీ వారు సినిమాలతో థియేటర్ల దగ్గర పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరు ఏ మాత్రం తగ్గకుండా నటన పరంగా వాళ్ల చిత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మెగా ఫ్యామిలీ అంటే ఆయనకు ఇష్టం లేదు అనే వార్తలు బాగా ప్రచారం అయ్యేవి. అంతేకాకుండా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో లైవ్ లో మాట్లాడుతూ చిరంజీవి ప్రస్తావన రావడంతో ఆయన ఎవరో నాకు తెలియదు అనడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంపాటు నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కి, మెగాస్టార్ ఫ్యామిలీతో విభేదాలు ఉన్నాయనే వార్తలు విస్తృతంగా వినిపించేవి.
అసలు ఈ వార్తలకు గల కారణం ఏమిటి..? ఈ కుటుంబాల మధ్య ఉన్న విభేదానికి కారణం ఎవరు..? వార్తల్లో ఉన్నది ఎంత వరకు నిజం అనే విషయంలోకి వెళ్తే.. పరిస్థితులు మారి చిరంజీవి మనస్తత్వం గురించి ఎన్టీఆర్ తెలుసుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. ఎన్టీఆర్, మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌తో ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఆర్ఆర్ఆర్ మూవీలో కలిసి నటించారు. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. కరోనా, ఒమిక్రాన్ కారణం వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ టైంలో వీళ్లిద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది.
కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే ఎన్టీఆర్‌కు ఎందుకు పడలేదనే ప్రశ్నకు ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పేవారు కాదు. బాక్సాఫీస్ వసూళ్లు, ఇమేజ్ వల్ల వచ్చిన ఈగో క్లాషెష్ అని మాత్రం పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. అప్పట్లో ఒక నెంబర్ వన్ హీరో గురించి, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ తనకు తెలియదు అని పేర్కొనడం మెగాఫ్యాన్స్‌కు కొంచెం బాధ కలిగించింది.
మెగా-నందమూరి ఫ్యామిలీ పాత గొడవలకు కారణం ఏమిటి..? అనే దానిపై సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో ఆయన దగ్గర ఓ మేనేజర్ ఉండేవాడట. ఆ మేనేజర్ చిరంజీవి గురించి చెడుగా ఎన్టీఆర్ కు లేనిపోనివి చెప్పేవాడట. మేనేజర్ గురించి అసలు నిజం తెలియడంతో ఎన్టీఆర్ అతని ఉద్యోగం నుంచి తొలగించారని, ఆ తరువాత చిరు ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎన్టీఆర్‌కు స్నేహబంధం పెరిగినట్టు నిర్మాత గిరి ఆ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…