Conductor Jhansi : గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ క్రేజీ సెలబ్రిటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కండక్టర్ ఝాన్సీ పల్సర్ బండి డాన్స్ కి వేసిన డాన్స్ తో ఒక్కసారిగా ఆమెపై అందరి దృష్టిపడింది. మల్లెమాల సమస్థ విడుదల చేసిన ఒక్క ప్రోమోతో ఝాన్సీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పల్సర్ బండి పాటతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు ఝాన్సీ గురించి వార్తలు కనిపిస్తున్నాయి.
త్వరలోనే వెండి తెర స్టార్ గా మారబోతుంది కండక్టర్ ఝాన్సీ. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు గాను ఝాన్సీకి అవకాశం వచ్చింది. సంపూర్ణేష్ బాబు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా కండక్టర్ ఝాన్సీ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని సమాచారం వినిపిస్తుంది. కండక్టర్ ఝాన్సీకి ఓవర్ నైట్ లో ఒక్కసారిగా ఇంత స్టార్ డమ్ రాలేదు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని అదృష్టం కలిసి వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం వల్ల ఆమె అనేక అవకాశాలు దక్కించుకుంటోంది.
బుల్లితెర షో లోనూ, సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒకప్పుడు షోల ద్వారా వెయ్యి, రెండు వేలు రెమ్యూనరేషన్ తీసుకునే ఝాన్సీ ఇప్పుడు 20 నుంచి 30 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం ఝాన్సీ యొక్క డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు మళ్లీ పిలిస్తే వెళ్ళలేనంత బిజీగా మారిపోయింది. ఆమె డాన్స్ మాస్టర్ రమేష్ కూడా చాలా ఫేమస్ అయ్యారు. చూడ్డానికి పొడవు తక్కువగా ఉన్నా కూడా ఇతడు ఝాన్సీ వంటి ఎంతో మంది డాన్సర్‌లను తీర్చిదిద్దాడంటూ 11 సంవత్సరాల క్రితమే జీ తెలుగు మోహించిన తీన్మార్ కార్యక్రమంలో ఉదయ భాను చెప్పడం ఆశ్చర్యం. అప్పట్లో డాన్స్ మాస్టర్ రమేష్ గురించి ఉదయభాను చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…