Conductor Jhansi : కండ‌క్ట‌ర్ ఝాన్సీ 11 ఏళ్ల కింద‌టే టీవీలో క‌నిపించింది.. ఎందులో అంటే..?

September 21, 2022 7:35 PM

Conductor Jhansi : గాజువాక లేడీ కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ క్రేజీ సెలబ్రిటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కండక్టర్ ఝాన్సీ పల్సర్ బండి డాన్స్ కి వేసిన డాన్స్ తో ఒక్కసారిగా ఆమెపై అందరి దృష్టిపడింది. మల్లెమాల సమస్థ విడుదల చేసిన ఒక్క ప్రోమోతో ఝాన్సీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పల్సర్ బండి పాటతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే చాలు ఝాన్సీ గురించి వార్తలు కనిపిస్తున్నాయి.

త్వరలోనే వెండి తెర స్టార్ గా మారబోతుంది కండక్టర్ ఝాన్సీ. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో ఐట‌మ్‌ సాంగ్ చేసేందుకు గాను ఝాన్సీకి అవకాశం వచ్చింది. సంపూర్ణేష్ బాబు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కూడా కండక్టర్ ఝాన్సీ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని సమాచారం వినిపిస్తుంది. కండక్టర్ ఝాన్సీకి ఓవర్ నైట్ లో ఒక్కసారిగా ఇంత స్టార్ డమ్ రాలేదు. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని అదృష్టం కలిసి వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం వల్ల ఆమె అనేక అవకాశాలు దక్కించుకుంటోంది.

Conductor Jhansi appeared in TV 11 years ago
Conductor Jhansi

బుల్లితెర షో లోనూ, సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఒకప్పుడు షోల ద్వారా వెయ్యి, రెండు వేలు రెమ్యూనరేషన్  తీసుకునే ఝాన్సీ ఇప్పుడు 20 నుంచి 30 వేల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం ఝాన్సీ యొక్క డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్లు మళ్లీ పిలిస్తే వెళ్ళలేనంత బిజీగా మారిపోయింది. ఆమె డాన్స్ మాస్టర్ రమేష్ కూడా చాలా ఫేమస్ అయ్యారు. చూడ్డానికి పొడ‌వు త‌క్కువ‌గా ఉన్నా కూడా ఇతడు ఝాన్సీ వంటి ఎంతో మంది డాన్సర్‌ల‌ను  తీర్చిదిద్దాడంటూ 11 సంవత్సరాల క్రితమే జీ తెలుగు మోహించిన తీన్మార్ కార్యక్రమంలో ఉదయ భాను చెప్పడం ఆశ్చర్యం. అప్పట్లో డాన్స్ మాస్టర్ రమేష్ గురించి ఉదయభాను చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now