చలికాలం వచ్చిందంటే చాలు.. మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతోపాటు ఆస్తమా కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. కఫం అధికంగా ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతోపాటు సైనస్ సమస్య కూడా అవస్థలకు గురి చేస్తుంది. అయితే సీజనల్‌గా లభించే పండ్లను తినడం ద్వారా మనం ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్‌లో మనకు జామకాయలు ఎక్కువగా లభిస్తాయి. ధర కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తారు. కనుక జామకాయలను ఈ సీజన్‌లో తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
జామకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే చలికాలంలో మన జుట్టు, చర్మం పొడిబారుతాయి. కానీ జామకాయలను తింటే చర్మం, జుట్టు సురక్షితంగా ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో చర్మం పగలదు. జుట్టు బలంగా మారుతుంది. విరిగిపోకుండా ఉంటుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి జామకాయలను చలికాలంలో తప్పనిసరిగా తినాల్సి ఉంటుంది.
ఈ కాయలను తినడం వల్ల మనకు పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. చలికాలంలో చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తుంటాయి. కానీ జామకాయలను తింటే హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. జామకాయలను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా అజీర్ణం, మలబద్దకం వంటివి తగ్గుతాయి.
మనకు చలికాలంలో జీర్ణ సమస్యలు బాగానే వస్తుంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం కూడా వస్తుంది. కనుక జామకాయలను తింటే ఈ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. భోజనం చేసిన తరువాత మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్కటి చొప్పున జామకాయను తింటే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిని తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయడమే కాకుండా.. షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేసే విషయం. షుగర్ ఉన్నవారు రోజుకు రెండు సార్లు ఒక్కొక్కటి చొప్పున జామకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
జామకాయలను తినడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. పొట్ట, నడుము, పిరుదుల భాగాల్లో ఉండే కొవ్వు కరిగి సన్నగా.. నాజూగ్గా.. తయారవుతారు. ఇలా చలికాలంలో మనం జామకాయలతో ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక ఈ సీజన్ లో ఈ కాయలను తప్పకుండా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…