Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. మే 6న సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ ఎంతో కృషి చేస్తున్నాడు. అందుకు కారణం ఈ సినిమాకి పోటీగా మరో రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో శ్రీ విష్ణు భళా తందనాన, సుమ జయమ్మ పంచాయతీ సినిమాలు ఉన్నాయి. సుమ చిత్రంపై ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా రోజుల తర్వాత సినిమా చేయడం, దాంతోపాటు తన సినిమాకి స్టార్ హీరోలతో ప్రమోషన్స్ చేయించడంతో సుమ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
ఇక తన సినిమాకి కూడా మంచి ప్రమోషన్ కలిగేలా విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయగా ఆ వీడియో వివాదాస్పదంగా మారింది. టీవీ 9 యాంకర్ దేవి డిబేట్‌లో హీరో విశ్వక్ సేన్‌ను గెట్ అవుట్ అని అనడం.. దానికి ఆయన బూతు పదాన్ని చటుక్కున అనేయడం జరిగిపోయింది. ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఫ్యాన్స్.. నెటిజన్స్.. విశ్వక్ సేన్‌కు తమ మద్దతుని తెలియజేశారు. యాంకర్ దేవిపై ఓ రేంజ్‌లో ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకున్న హీరో విశ్వక్ సేన్.. చివరకు తాను ఆ పదాన్ని వాడకుండా ఉండాల్సిందంటూ సారీ కూడా చెప్పారు.
అయితే వివాదం మాత్రం అంతటితో సద్దుమణగలేదు. యాంకర్ దేవి తెలంగాణ మంత్రి తలసాని వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇక విశ్వక్ సేన్ తన లీగల్‌టీమ్‌తో యాంకర్ దేవిపై భారీ ఎత్తున పరువు నష్టం దావా వేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే ఏది ఎలా ఉన్నా.. ప్రాంక్ వీడియోతో తన సినిమాకు ప్రమోషన్ చేసుకోవాలని చూసిన విశ్వక్ సేన్ ప్లాన్ అయితే బాగానే వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్నదానికన్నా ఎక్కువగానే ఆయన ప్లాన్ చేసింది. దీంతో ఆయన మూవీకి పబ్లిసిటీ బాగా వచ్చేసింది. ఇది ఆ మూవీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇక ఆయన మూవీ ఎలా ఉంటుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…