Virata Parvam : వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. విరాట పర్వం. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. మరోవైపు రానా సొంత బ్యానర్‌పై నిర్మించిన మూవీ. అయినప్పటికీ ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశ పరిచింది. అసలే ప్రేక్షకులు థియేటర్లకు రాక చిత్ర పరిశ్రమ ఇబ్బందులకు గురవుతుంటే.. హీరోయిన్లు చేసే కామెంట్లు వివాదాస్పదం అవుతూ సినిమాకు మైనస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సాయి పల్లవి కూడా అలాగే చేసింది.
విరాట పర్వం సినిమా రిలీజ్ సమయంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఓ వర్గాన్ని మరింత రెచ్చగొట్టాయి. దీంతో సినిమాపై ఈ వివాదం ప్రభావం పడింది. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న సాయి పల్లవి మొదటిసారిగా వివాదంలో చిక్కుకుని సారీ చెప్పింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో దీన్ని ఓటీటీలో అయినా త్వరగా రిలీజ్ చేసి నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నారు. అందుకనే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విరాట పర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
విరాట పర్వం సినిమాకు గాను డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ పొందింది. రూ.15 కోట్లకు ఈ హక్కును నెట్‌ఫ్లిక్స్ కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే ఇంత త్వరగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఓ వైపు నిర్మాతలు అందరూ చర్చించుకుని ఏ మూవీ అయినా సరే రిలీజ్ అయ్యాక 50 రోజుల తరువాతే ఓటీటీలో రావాలని చూసేందుకు యత్నిస్తున్నారు. కానీ విరాట పర్వం మాత్రం చాలా త్వరగా కనీసం నెల కాక ముందే ఓటీటీలోకి వస్తోంది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విరాట పర్వం సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేతా పేతురాజ్‌లు పలు ఇతర పాత్రల్లో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…