Virata Parvam : ఓటీటీలో విరాట ప‌ర్వం మూవీ.. మ‌రీ ఇంత త్వ‌ర‌గానా..?

June 30, 2022 3:28 PM

Virata Parvam : వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ద‌గ్గుబాటి రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. విరాట ప‌ర్వం. వాస్త‌వానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉంది. మ‌రోవైపు రానా సొంత బ్యాన‌ర్‌పై నిర్మించిన మూవీ. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం అనేక సార్లు వాయిదా ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం నిరాశ ప‌రిచింది. అస‌లే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాక చిత్ర ప‌రిశ్ర‌మ ఇబ్బందుల‌కు గుర‌వుతుంటే.. హీరోయిన్లు చేసే కామెంట్లు వివాదాస్ప‌దం అవుతూ సినిమాకు మైన‌స్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సాయి ప‌ల్ల‌వి కూడా అలాగే చేసింది.

విరాట ప‌ర్వం సినిమా రిలీజ్ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌లు ఓ వ‌ర్గాన్ని మ‌రింత రెచ్చ‌గొట్టాయి. దీంతో సినిమాపై ఈ వివాదం ప్ర‌భావం ప‌డింది. ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న సాయి ప‌ల్ల‌వి మొద‌టిసారిగా వివాదంలో చిక్కుకుని సారీ చెప్పింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌ర‌చ‌డంతో దీన్ని ఓటీటీలో అయినా త్వ‌రగా రిలీజ్ చేసి న‌ష్టాన్ని పూడ్చుకోవాల‌ని చూస్తున్నారు. అందుక‌నే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విరాట ప‌ర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

Virata Parvam movie releasing on OTT on July 1st
Virata Parvam

విరాట ప‌ర్వం సినిమాకు గాను డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ పొందింది. రూ.15 కోట్ల‌కు ఈ హ‌క్కును నెట్‌ఫ్లిక్స్ కొన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఇంత త్వ‌ర‌గా ఈ మూవీ ఓటీటీలోకి వ‌స్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఓ వైపు నిర్మాత‌లు అంద‌రూ చ‌ర్చించుకుని ఏ మూవీ అయినా స‌రే రిలీజ్ అయ్యాక 50 రోజుల త‌రువాతే ఓటీటీలో రావాల‌ని చూసేందుకు య‌త్నిస్తున్నారు. కానీ విరాట ప‌ర్వం మాత్రం చాలా త్వ‌ర‌గా క‌నీసం నెల కాక ముందే ఓటీటీలోకి వ‌స్తోంది. దీంతో అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక విరాట ప‌ర్వం సినిమాలో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, ఈశ్వ‌రీ రాము, నివేతా పేతురాజ్‌లు ప‌లు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now