Viral Video : యాక్సిడెంట్ జ‌రిగితే స‌హాయం చేస్తున్న‌ట్లు న‌టించి స్కూటీ దొంగిలించాడు.. చివ‌ర‌కు ఏమైందంటే.. వీడియో..!

May 21, 2022 11:53 AM

Viral Video : ప్ర‌మాదాలు అనేవి చెప్పి జ‌ర‌గ‌వు. చెప్ప‌కుండానే జ‌రుగుతాయి. అవి అక‌స్మాత్తుగా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్ర‌మాదాలు. మ‌నం రోడ్డుపై వాహ‌నంపై వెళ్లేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే వెంట్రుక వాసిలో ప్ర‌మాదం చోటు చేసుకుంటుంది. మనం వాటి నుంచి బ‌తికి బ‌య‌ట‌ప‌డేది చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే అని చెప్పాలి. అయితే ఆ వ్య‌క్తి మాత్రం కారు వెనుక నుంచి ఢీకొన్నా ఏమీ కాలేదు. కార‌ణం.. హెల్మెట్ పెట్టుకోవ‌డ‌మే. అయితే అంత‌టి ప్ర‌మాదంలోనూ ఆ వ్య‌క్తి ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఇంకో వ్య‌క్తి దొంగిలించేందుకు య‌త్నించాడు. ఇక చివ‌రికి ఏం జ‌రిగిందంటే..

ర‌ద్దీగా ఉన్న రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న ఓ వ్య‌క్తిని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో స్కూటీతో స‌హా ఆ వ్య‌క్తి ముందుకు ఎగిరిప‌డ్డాడు. అయితే అత‌ని అదృష్టం బాగుంది కాబోలు.. అంతగా ప‌డిపోయినా.. అత‌నికి దెబ్బ‌లు ఏమీ త‌గ‌ల్లేదు. కార‌ణం.. అత‌ను హెల్మెట్ ధరించ‌డ‌మే అని చెప్ప‌వచ్చు. ఇక త‌న స్కూటీని నిల‌బెట్టేందుకు చుట్టూ ఉన్న కొంద‌రు వ‌చ్చారు. అయితే అత‌ను త‌న స్కూటీ వ‌ద్ద ఉండ‌కుండా.. త‌న‌ను వెనుక నుంచి ఢీకొన్న వ్య‌క్తిని ఆపాడు. అత‌ని కారు వ‌ద్ద‌కు వెళ్లి అత‌నితో గొడ‌వ ప‌డ‌సాగాడు.

Viral Video man pretended to help and theft scooty
Viral Video

అయితే ఆ వ్య‌క్తి స్కూటీని నిల‌బెట్టేందుకు హెల్ప్ చేస్తున్న‌ట్లు న‌టించిన ఓ వ్య‌క్తి సందు చూసుకుని ఆ స్కూటీని అక్క‌డి నుంచి దొంగిలించి తీసుకెళ్ల‌బోయాడు. కానీ రోడ్డు బాగా లేక‌పోవ‌డం.. అత‌ను స్కూటీ ఎక్క‌కపోవ‌డం కార‌ణంగా.. అత‌నికి అది కంట్రోల్ కాలేదు. దీంతో కొంత దూరం వ‌ర‌కు వెళ్లిన ఆ వ్య‌క్తి అక్క‌డే ప‌డిపోయాడు. ఇది చూసిన స్కూటీ ఓన‌ర్ హుటాహుటిన అక్క‌డికి చేరుకున్నాడు. ఈ త‌తంగం మొత్తం అక్క‌డే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయింది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో వైర‌ల్ గా మారింది. అయితే త‌రువాత ఏం జ‌రిగింది.. అన్న విషయం తెలియ‌లేదు. కానీ ఈ వీడియో మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది. బైక్‌ను దొంగిలించాల‌నుకున్న వ్య‌క్తికి స‌రైన గుణ‌పాఠం ఇన్‌స్టంట్‌గా ల‌భించింది.. అంటూ నెటిజన్లు ఈ వీడియో ప‌ట్ల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్ప‌టికే 53వేల‌కు పైగా వ్యూస్‌, 7300కు పైగా లైక్స్ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment