Viral Photo : ఈ ఫొటోలో ఉన్న మెగా హీరోను గుర్తు ప‌ట్టారా.. స్టార్ హీరో..!

November 25, 2022 3:40 PM

Viral Photo : పవన్‌ కళ్యాణ్‌..  ఈ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్‌ కళ్యాణ్  సినిమా థియేటర్లోకి వచ్చిందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌కు ఈతరం యంగ్‌ జనరేషన్‌ కూడా ఎంతగానో అభిమానిస్తుండడం విశేషం అని చెప్పవచ్చు. ఈ మధ్య సినిమాల కన్నా రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టాక సమాజ సమస్యలు, తన అభిప్రాయం, ప్రజల అవసరాల కోసం డిమాండ్ చేస్తూ ఇలా పలు అంశాలకే పూర్తి ప్రాధాన్యత ఇస్తూ ఆయన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ పెడ్తున్న సంగతి తెల్సిందే.

కానీ ఇప్పుడు ఓ ఫోటో తీవ్ర సంచలనం రేపుతోంది. అది ఏంటంటే.. పవన్ చిన్నప్పటి ఫోటో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. పైగా అందులో పవన్ సోదరులు చిరంజీవి, నాగబాబు, ఇద్దరు సోదరిమణులతో కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Photo pawan kalyan child hood one have you identified
Viral Photo

దాదాపు ఇది 40 సంవత్సరాల క్రితం ఈ ఫోటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫొటోలో ఉన్న పవన్ అప్పటికి 7వ తరగతి చదుతున్నాడు. నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు తీసిన ఫోటో అని పవన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. చిరు నలుపు చొక్కాలో, నాగబాబు తెలుపు చొక్కాలో మురిసిపోతున్నారు. చిరు అప్పటికే హీరోగా రాణిస్తున్నాడు. ఇక నిక్కరు, చొక్కాతో గల పవన్ చాలా డల్ గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో పవన్ దీర్ఘకాలిక శ్వాస కోశ వ్యాధినుంచి కోలుకున్నాడట. ఈ ఫోటోను మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇలా తన చిన్ననాటి ఫోటో పవన్ షేర్ చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now