Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అంత పెద్దగా విజయం సాధించలేదు. కానీ మనోడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే పోతోంది. రీసెంట్‌గా రష్మికతో ముంబైలో డిన్నర్‌కి వెళ్లిన విజయ్ దేవరకొండ అందరి దృష్టినీ ఆకర్షించాడు. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.
ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండడంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య రొమాన్స్ సాగుతోంది అంటూ రూమర్లు వినిపించాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. ఇంకెలాంటి రిలేషన్ లేదని గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే రష్మికతో కలిసి చేసిన డిన్నర్‌లో విజయ్ దేవరకొండ మందు తాగినట్టుగా తెలుస్తోంది. తాజగా ఆయన చేతిలో బాటిల్ పట్టుకొని ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. “నేను గత వారం నుంచి చాలా మద్యం సేవిస్తున్నాను” అంటూ కామెంట్ పెట్టాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రస్తుతం లైగర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈచిత్రంలో భాగం కావడంతో లైగర్ కు ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…