Vijay Devarakonda : గత వారం నుండి బాగా తాగుతున్నా.. విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ కామెంట్స్..!

December 22, 2021 10:46 AM

Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ త‌ర్వాత అంత పెద్దగా విజ‌యం సాధించ‌లేదు. కానీ మ‌నోడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే పోతోంది. రీసెంట్‌గా ర‌ష్మిక‌తో ముంబైలో డిన్న‌ర్‌కి వెళ్లిన విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రి దృష్టినీ ఆకర్షించాడు. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.

Vijay Devarakonda  said he is drinking from last one week

ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండడంతో ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య రొమాన్స్ సాగుతోంది అంటూ రూమర్లు వినిపించాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. ఇంకెలాంటి రిలేషన్ లేదని గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే ర‌ష్మిక‌తో క‌లిసి చేసిన డిన్న‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మందు తాగిన‌ట్టుగా తెలుస్తోంది. తాజ‌గా ఆయ‌న చేతిలో బాటిల్ ప‌ట్టుకొని ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. “నేను గత వారం నుంచి చాలా మద్యం సేవిస్తున్నాను” అంటూ కామెంట్ పెట్టాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ప్రస్తుతం లైగర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈచిత్రంలో భాగం కావడంతో లైగర్ కు ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now