Sunny : బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వంద రోజులకి పైగా హౌజ్‌లో ఉన్న అతడు బయట ప్రపంచంతో తెగ ముచ్చిటిస్తూ కనిపిస్తున్నాడు. పలు ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే సన్నీకి హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది. ఈ ప్రెస్‌మీట్‌లో సన్నీకి చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది.
ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తోపాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది చిన్నపాటి సంఘటనే అయినా సన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట వైరల్ గా మార్చేశారు. ఇక ఈ వీడియో చూసిన వారు జాగ్రత్త సన్నీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా విజేతగా అవతరించిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…