గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sunny : సన్నీకి కరెంట్ షాక్.. తప్పిన పెను ప్ర‌మాదం..

Sunny : బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ స‌న్నీ ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వంద రోజుల‌కి పైగా హౌజ్‌లో ఉన్న అత‌డు బ‌య‌ట ప్ర‌పంచంతో తెగ ముచ్చిటిస్తూ క‌నిపిస్తున్నాడు. ప‌లు ఛానెల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే…

Sunny : సన్నీకి కరెంట్ షాక్.. తప్పిన పెను ప్ర‌మాదం..

Sunny : బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ స‌న్నీ ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వంద రోజుల‌కి పైగా హౌజ్‌లో ఉన్న అత‌డు బ‌య‌ట ప్ర‌పంచంతో తెగ ముచ్చిటిస్తూ క‌నిపిస్తున్నాడు. ప‌లు ఛానెల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే సన్నీకి హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది. ఈ ప్రెస్‌మీట్‌లో సన్నీకి చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది.

Sunny got electric shock Missed big accident ..

ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తోపాటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్ర‌మాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చిన్నపాటి సంఘటనే అయినా సన్నీ ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట వైరల్ గా మార్చేశారు. ఇక ఈ వీడియో చూసిన వారు జాగ్రత్త సన్నీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా విజేతగా అవతరించిన సన్నీకి కింగ్‌ నాగార్జున బిగ్‌బాస్‌ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక రూ.50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్‌ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్‌ బైక్‌ కూడా గెలుచుకున్నాడని ప్రకటించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి