గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 Telugu : స‌న్నీకి స‌డెన్ గా పెరిగిపోయిన ఫీమేల్ ఫాలోవ‌ర్లు.. కార‌ణం అదేనా ?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సీజ‌న్‌లో అంద‌రు ఇంటి స‌భ్యుల్లాగే వీజే స‌న్నీ కూడా పాపులారిటీని పొందాడు. న‌మ్మ‌క‌మైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. స‌న్నీ త‌న నిజాయితీ అయిన వైఖ‌రితో బిగ్ బాస్…

Bigg Boss 5 Telugu : స‌న్నీకి స‌డెన్ గా పెరిగిపోయిన ఫీమేల్ ఫాలోవ‌ర్లు.. కార‌ణం అదేనా ?

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సీజ‌న్‌లో అంద‌రు ఇంటి స‌భ్యుల్లాగే వీజే స‌న్నీ కూడా పాపులారిటీని పొందాడు. న‌మ్మ‌క‌మైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. స‌న్నీ త‌న నిజాయితీ అయిన వైఖ‌రితో బిగ్ బాస్ హౌస్ లో పాపుల‌ర్ అయ్యాడు. ఇక కొంద‌రు స్నేహితుల‌ను కూడా హౌస్ లో సంపాదించుకున్నాడు. ముఖ్యంగా క‌ష్ట స‌మ‌యాల్లో మాన‌స్ అత‌నికి స‌హ‌కారం అందిస్తున్నాడు.

Bigg Boss 5 Telugu  sunny got female followers up suddenly

ఇక నామినేష‌న్స్ స‌మ‌యంలో స‌న్నీని అనీ మాస్ట‌ర్ జైలులోకి పంపారు. అయితే ఆ రోజు నుంచీ స‌న్నీకి ఫేమేల్ ఫాలోయింగ్ ఎక్కువ‌గా పెరిగింద‌ట‌. అది ఎందుక‌ని అంటే.. ఆ రోజు అత‌ను ధ‌రించిన ఔట్ ఫిట్ వ‌ల్లే అని తేలింది.

శ్రీ‌రామ్ చంద్ర‌, జెస్సీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట్లో హ్యాండ్ స‌మ్ అనే పేరు సంపాదించారు. అయితే ఆ క్ల‌బ్‌లో తాజాగా స‌న్నీ చేరిపోయాడు. స‌న్నీ ఆ రోజు గ్రీన్ వెల్వెట్ ధ‌రించ‌డ‌మే కాక ల‌వ్ సింబ‌ల్ చూపించాడు. దీంతో ఆ స్టైల్ చాలా మంది ఫీమేల్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింద‌ట‌. ఈ క్ర‌మంలోనే వారు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

స‌న్నీ గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో బాగున్నాడు.. అని కొంద‌రు కామెంట్లు చేస్తే.. అత‌ను నా క్ర‌ష్ అని కొంద‌రు కామెంట్లు చేశారు. అతను ఇంట్లోనే కాదు, బ‌య‌ట కూడా హ్యాండ్‌స‌మ్ ప‌ర్స‌నే.. అని ఇంకొంద‌రు కామెంట్లు పెట్టారు. దీంతో స‌న్నీ పాపులారిటీ ఫీమేల్ ప్రేక్ష‌కుల్లో బాగా పెరిగిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి అత‌నికి ఓట్లు ప‌డేందుకు అది ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి