Bigg Boss 5 : స‌న్నీని టార్గెట్ చేస్తున్న హౌజ్‌మేట్స్‌.. రోజురోజుకీ మ‌రింత స్ట్రాంగ్‌గా వీజే..

October 30, 2021 3:52 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్టింగ్ లో కాస్త బోరింగ్ గా అనిపించినా.. రాను రాను చాలా స్ట్రాంగ్ గా, డ్రామా వేదికగా మారడంతో ఆడియన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ రెండు ఎపిసోడ్స్ లో సన్నీ టాస్క్ ఆడుతున్న విధానం, అతని ఆవేశం, హౌస్ మేట్స్ అయిన షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్ర, రవిలతోపాటు మిగతా కంటెస్టెంట్స్ కి చిరాకు పెడుతోంది.

Bigg Boss 5  sunny targeted by housemates

నిజానికి రీసెంట్ గా పూర్తి చేసుకున్న కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మానస్ ను మాత్రమే సన్నీకి సపోర్ట్ చేయడంతో, కాజల్ తాను నార్మల్ గేమ్ ప్లాన్ తో ఉన్నానంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఈ క్రమంలో విశ్వ, అనీ మాస్టర్, షణ్ముఖ్ అండ్ బ్యాచ్ తో సహా సన్నీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వస్తువుల్ని విసిరికొట్టడం, వేరే విషయాలపై కూడా సన్నీపై అరవడం చేశారు. ఈ నేపథ్యంలో సన్నీ కూడా తన సహనాన్ని కోల్పోయి మరీ హౌస్ మేట్స్ పై అరవడం, టంగ్ స్లిప్ అవ్వడంతోపాటు ఇంట్లో ఉన్న మరికొంతమందిపై మీటింగ్ పెట్టి వాదించడం చేశారు.

ఇలా మాట్లాడుతున్నప్పుడు సన్నీ వాదిస్తున్నప్పుడు రీజన్ లేదు, లాజిక్ లేదని విషయాన్ని మర్చిపోయి.. కేవలం సన్నీ వాయిస్ పెద్దగా అరుస్తున్నారనే కారణంతోనే టార్గెట్ చేస్తున్నారనేది టాక్. అలాగే సన్నీ గేమ్ ఎలా ఆడుతున్నాడనేది చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది. అలాగే వారికి నచ్చిన విధంగా ఓటింగ్ చేయడానికి స్కోప్ ఉంది. అలాగే సన్నీతో పోటీ పడాలనుకుంటున్న లోబో లాంటివాళ్ళు తమ గేమ్ ని లాస్ అవుతున్నారు. ఇక ఈవారం ఎలిమినేట్ అయ్యేవాళ్ళల్లో ఎక్కువగా లోబో పేరు వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment